calender_icon.png 14 May, 2025 | 5:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

6న ‘గాజు గ్లాస్’ కేటాయింపు పిటిషన్‌పై విచారణ

03-05-2024 01:17:34 AM

అమరావతి, మే 2 (విజయక్రాంతి): జనసేన ఎన్నికల గుర్తు అయిన గాజు గ్లాస్‌ను ఆ పార్టీ పోటీ ప్రభావం లేని చోట్ల ఫ్రీ సింబల్ చేయడాన్ని సవాల్ చేస్తూ టీడీపీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు గురువారం విచారణను ఈ నెల 6వ తేదీకి వాయిదా వేసింది. బ్యాలెట్ల ముద్రణ బుధవారం నుంచి ప్రారంభమైందని, ఇప్పటికే ఈసీ ఎలక్ట్రాని క్ బ్యాలెట్ల పంపిణీ  , ఈ దశలో కోర్టు జోక్యం చేసుకుంటే ఎన్నికల నిర్వహణకు ఆటంకం కలుగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం తరఫు న సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ వాదించారు. రాజ్యాంగంలోని 329(బీ) అధికరణ ప్రకారం ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డాక నిర్వహణ ప్రక్రియలో కోర్టులు జోక్యానికి వీలుపడదన్నారు. దీంతో తమకు కొంత గడువు కావాలని పిటిషనర్ తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ కోర్టును కోరారు. దీంతో విచారణను వాయిదా వేస్తూ జస్టిస్ బి.కృష్ణమోహన్ ఉత్తర్వులు జారీ చేశారు.