calender_icon.png 30 July, 2025 | 6:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాటు సారా స్థావరాలపై ఎక్సైజ్ అధికారుల దాడులు

14-05-2025 08:46:08 PM

ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం కడెం మండలం అల్లంపల్లి పంచాయతీలోని చింతగూడ గ్రామంలో మంగళవారం ఎక్సైజ్ అధికారులు(Excise Officers) నాటు సారా తయారీ స్థావరాలపై దాడులు చేశారు. బుధవారం ఎస్సై కృష్ణ సాగర్ రెడ్డి(SI Krishna Sagar Reddy) బృందం ఈ దాడులు నిర్వహించి చింతగూడ గ్రామంలోని అజ్మీరా దశరథ్ ఇంట్లో 5 లీటర్ల గుడుంబా, 200 లీటర్ల బెల్లం పాకం స్వాధీనం చేసుకుని, ధ్వంసం చేశామని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.