04-05-2024 12:02:28 AM
బెయిల్ పిటిషన్ పరిశీలించాలని ఈడీకి ఆదేశం
ఢిల్లీ, మే 3 (విజయక్రాంతి): ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టున సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట లభించింది. కేజ్రీవాల్ తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై సుప్రీం కోర్టు శుక్రవారం సాను కూలంగా స్పందించింది. లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా కేజ్రీవాల్ మధ్యంతర బెయి ల్ పిటిషన్‌ను పరిశీలించవచ్చని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి తెలిపింది. ఈ అంశంపై మే 7న మరోసారి విచారణ జరుపుతామని, విచారణకు సిద్ధం గా ఉండాలని ఈడీ తరఫు న్యాయవాదిని అత్యున్నత న్యాయస్థానం కోరింది. “మేము బెయిల్ మంజూరు చేయవచ్చు లేదా మంజూరు చేయకపో వచ్చు. ఏది జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు.” అని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. అయితే, కోర్టు బెయిల్ మంజూరు చేస్తుందని భావించవద్దని ఇరుపక్షాలను హెచ్చరించింది. కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నందున ఏదైనా అధికారిక ఫైల్‌పై సంతకం చేయాలా? వద్దా? అనే విషయాన్ని కూడా పరిశీలించాలని సుప్రీం ఈడీని కోరింది.