26-09-2025 06:46:57 PM
రేగొండ/భూపాలపల్లి,(విజయక్రాంతి): చాకలి ఐలమ్మ పోరాట పటిమ, పట్టుదలే స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావులు అన్నారు. శుక్రవారం వీరనారి చాకలి ఐలమ్మ 130వ జయంతిని పురస్కరించుకొని ఐడిఓసి కార్యాలయంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావులు పాల్గొని చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... త్యాగానికి, పోరాటానికి స్ఫూర్తి వీరనారి చాకలి ఐలమ్మ నిలిచారని తెలిపారు.చాకలి ఐలమ్మ జన్మదినాన్ని జరుపుకోవడం చాలా గర్వంగా ఉందని ఆమె సింబల్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్ గా నిలిచారని అన్నారు.ఆమె ఆశయాలను మన జీవితంలో పాటించాలని వారి త్యాగాలు నేటి తరానికి తెలియజేయాలన్న ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జయంతి నిర్వహిస్తున్నట్లు వారు స్పష్టం చేశారు.