26-09-2025 06:54:10 PM
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): ప్రయత్నంమే మన విజయం, గెలుపు ఓటమిలో ఆటలో సహజమని ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ పట్టణ శ్రీనివాస్ కాలనీ మినీ స్టేడియం టెన్నిస్ క్రీడా మైదానంలో శుక్రవారం ఏర్పాటు చేసిన అభినంద సభకు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సెప్టెంబర్ 21 ఆదివారం ఉమ్మడి ఖమ్మం జిల్లా టెన్నిస్ టోర్నమెంట్ లో విజయం సాధించిన చిన్నారులను, హైదరాబాద్ ఓపెన్ నేషనల్ టెన్నిస్ అండర్ 60 లో రన్నర్ ఆఫ్ సాధించిన అన్నం వెంకటేశ్వర్లను, అదేవిధంగా ఆల్ ఇండియా నేషనల్ ఆర్చరీ విభాగంలో ఎంపికైన వంశీ నీ అభినందించారు.
ఈ సందర్భంగా ట్రైన్ కలెక్టర్ సౌరబ్ శర్మ మాట్లాడుతూ జీవితంలో ప్రయత్నం చేయడం అనేది ఆటల్లోనూ, చదువులోనూ చాలా ముఖ్యమని తెలిపారు. ఉదాహరణగా నేను తెలుగు మాట్లాడుటకై చాలా ప్రయత్నం చేస్తూ ఉంటానని తద్వారా నాకు తెలుగు అనేది వస్తుందని తెలిపారు. ప్రతి ఒక్క క్రీడాకారులు కూడా తప్పకుండా వారి ప్రయత్నాన్ని వదలకుండా ఉంటే గెలుపోటములు మన వెన్న అంటూ ఉంటాయన్నారు. ప్రతి ఒక్క పిల్లవాడు క్రీడా మైదానంలో చేరుకోవడం పట్ల వారి తల్లిదండ్రుల కృషిని కూడా కొనియాడారు. కోచ్ డానియల్ రాంబాబుకు శాలువాతో సన్మానిస్తూ, ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ యుగంధర్ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి విజయాలు పాల్వంచ ఏటిపి నుండి ఎన్నో అందుకోవాలని పిల్లలను దీవించారు. పాల్వంచ టెన్నిస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వై వెంకటేశ్వర్లు మాట్లాడుతూ క్రీడల పట్ల పిల్లలకు మా అసోసియేషన్ ద్వారా కావలసిన సౌకర్యాలు అందిస్తామని తెలియజేశారు. జిల్లా టెన్నిస్ అసోసియేషన్ సెక్రటరీ జకరయ్య మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లానే కాదు మిగిలిన జిల్లా వారితో కూడా టోర్నమెంట్ ఏర్పాట్లు మా సహకారం అందిస్తామని తెలిపారు. అనంతరం ట్రైన్ కలెక్టర్ సౌరవ్ శర్మకు శాలువాతో సన్మానించడం జరిగినది.