26-09-2025 06:00:56 PM
బెజ్జూర్,(విజయక్రాంతి): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలోని లంబాడిహెట్టి గ్రామమ సమీపంలో నాటుసారాయి రవాణా చేస్తున్న వాహనాన్ని పట్టుకున్నట్లు సిఐ రవి తెలిపారు. పక్క సమాచారము మేరకు వాహన తనిఖిలు చేయగా 10 లీటర్ల నాటుసారాయిని, ఒక ద్విచక్ర వాహనముని, మొబైల్ ఫోన్ ని స్వాదినపరుచుకొని లంబాడిహెట్టి గ్రామానికి చెంధీన జర్పుల అమర్ సింగ్ పై కేసు నమోదు చేసి, (5) ఐదుగురు పాత నేరస్తులను తహశీల్దార్ ముందు బైండోవర్ చేసినట్టు సిఐ రవి తెలిపారు. ఈ దాడుల్లో ఎస్ఐలు లోబానంద్, సురేష్,సిబ్బంది కుమార్ తదితరులు ఉన్నారు.