26-09-2025 06:59:46 PM
మహదేవపూర్,(విజయక్రాంతి): భారీ వర్షానికి ఇంటి గోడ కూలి మహిళా మృతి చెందిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం బెంగళూరు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం... గత రెండు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షానికి తను ఉంటున్న ఇంటి గోడ అర్ధరాత్రి కూలి మంద లక్ష్మీ మృతి చెందింది. లక్ష్మీ భర్త అయినా మంద దుర్గయ్య గత కొన్ని రోజులుగా పక్షవాతంతో బాధపడుతున్నాడు. కడు నిరుపేదైన మంద లక్ష్మీ భర్త దుర్గయ్యకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కటకం అశోక్ రూ.10 వేల ఆర్థిక సాయం అందించారు. 11 రోజుల కార్యక్రమం అనంతరం దుర్గయ్యను ఆసుపత్రిలో చేర్పిస్తామని తెలిపారు.