26-09-2025 07:04:52 PM
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్ లో చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... చాకలి ఐలమ్మ జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం చాకలి ఐలమ్మ ఉద్యమించారని గుర్తు చేశారు. మహానీయుల చరిత్రను భావితరాలకు అందించి వారి ఆశయాలకు అనుగుణంగా అందరు సమిష్టిగా పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, అంజయ్య గౌడ్, యాదిరెడ్డి, రఘుపతి రెడ్డి, బిసి అభివృద్ధి శాఖ జిల్లా అధికారి ఇందిర తదితరులు పాల్గొన్నారు.