16-09-2025 10:51:34 PM
ఘనంగా సంగారెడ్డిలో మహాసభ పోస్టర్ ఆవిష్కరణ
సంగారెడ్డి: దళిత జర్నలిస్టుల హక్కులను సాధించేందుకు, వారి సంక్షేమానికి సంబంధించిన కీలక సమస్యలను ప్రభుత్వానికి చేరవేసేందుకు దళిత జర్నలిస్టుల ఫోరం రాష్ట్రస్థాయి మహాసభను సెప్టెంబర్ 19న హైదరాబాద్ లోని రవీంద్రభారతి వేదికగా నిర్వహించనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళిత జర్నలిస్టులు భారీగా హాజరై, సమాజంలో సమానత్వాన్ని సాధించేందుకు, వారి అభివృద్ధికి చర్యలు తీసుకునేలా చర్చించనున్నట్లు ఫోరం నాయకులు తెలిపారు. దళిత జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటిని పరిష్కరించేందుకు సమగ్రంగా ప్రభుత్వానికి వినతివత్రాన్ని సమర్పించనున్నారు.
ఈనెల 19న జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమ పోస్టర్ను జెడ్పి సమావేశం మందిరంలో టీజీఐసీసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చేతులమీదుగా ఆవిష్కరించారు. అనంతరం సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈనెల 19న రవీంద్రభారతిలో దళిత జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమ పోస్టర్ ను సంగారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు చింత ప్రభాకర్ ఆవిష్కరించారు. అనంతరం సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ పరితోష్ పంకజ్ చేతుల మీదుగా చలో హైదరాబాద్ దళిత జర్నలిస్టుల ఫోరం మహాసభ పోస్టర్ను ఆవిష్కరించారు.