calender_icon.png 17 September, 2025 | 12:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉదయమ్మ దేహం భావి వైద్యులకు వైద్యపాఠం అయింది

16-09-2025 10:33:43 PM

హనుమకొండ,(విజయక్రాంతి): హన్మకొండ ప్రశాంత్ నగర్ సహృదయ ఆశ్రమం నివాసి ఉదయమ్మ (69) అనారోగ్యంతో మరణించగా, నిర్వాహకులు యకూబీ చోటేమియా సమాజ హితం కోరి, వైద్య విద్యా నిమిత్తం, మెడికల్ కాలేజీకి శరీర దానం చేయుటకు అంగీకరించగా, తెలంగాణ నేత్ర అవయవ శరీర దాతల అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక అంబులెన్స్ లో దేహాన్ని కేఎంసీ అనాటమీ విభాగానికి అప్పగించారు.

ప్రొఫెసర్ శశికాంతా అనాటమీ విభాగాధిపతి ఆదేశంతో అనటమీ వైద్య విద్యార్థులు, సిబ్బంది ప్రేమ్ కుమార్, యాద గిరి, ప్రణయ్ దేహాన్ని అనటమీ విభాగానికి తరలించారు. డాక్టర్ శశి కాంతా  మాట్లాడుతూ బావి వైద్యులకు వైద్య విద్య అధ్యయనం కోసం, శాస్త్ర పరిశోధన కోసం, సర్జరీని నేర్చుకోవడానికి ఉదయమ్మ దేహం వైద్య పాఠం అయింది అని, ప్రొఫెసర్ అన్నారు, అందరికి ధన్యవాదములు తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు మల్లారెడ్డి  మాట్లాడుతూ మరణానంతరం శరీర దానం చేస్తే వందల మందికి వైద్య పాఠం ఐదాం,వివరాలకు 8790548706, 9490133650 ఈ ఫోన్లను సంప్రదించవలసిందిగా కోరినారు.