16-09-2025 10:59:14 PM
బాన్సువాడ,(విజయక్రాంతి): బీర్కూర్ మండలంలోని మల్లాపూర్ గ్రామంలో మాజీ జెడ్పిటిసి ద్రోణవెళ్లి సతీష్, తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ, శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకే ఒక రూపాయి మిత్తితో 30 లక్షలు తీసుకున్నానని తెలిపారు. పోచారం అనుచరులు తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, దమ్ముంటే తనకు రావలసిన ఒక కోటి 80 లక్షల రూపాయల బిల్లులు ఇచ్చేది లేదని, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి. ఆలయంలో తడి బట్టలతో పోచారం శ్రీనివాసరెడ్డి ప్రమాణం చేస్తే గుడి డబ్బులు 30 లక్షలు వడ్డీతో సహా చెల్లిస్తానని సవాల్ విసిరారు.