calender_icon.png 17 September, 2025 | 12:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి బిడ్డకు పోషణ, విద్య అవసరం

16-09-2025 10:48:15 PM

ఏటూరునాగారం,(విజయక్రాంతి): ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని గిరిజన భవనంలో మరియు మంగపేట మండలంలోని రైతు వేదికలో మంగళవారం రోజున సీడీపీఓ ఐసిడియస్ ప్రాజెక్ట్ ఏటూరునాగారం ఈపీ. ప్రేమలత  ఆధ్వర్యంలో “పోషన్ బి పడాయి బి శిక్షణ తరగతులు రెండు బ్యాచ్ లు మంగళవారం నుండి ఈ నెల 18 వరకు మూడు రోజులు అంగన్వాడీ టీచర్లకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడమైనది ఈసందర్భంగా సీడీపీఓ ఏటూరునాగారం ఈపీ. ప్రేమలత మాట్లాడుతూ పుట్టిన ప్రతి బిడ్డ కు పోషణ అవసరం చదువు కూడా అంతే అవసరం. బాల్య దశలో నే బిడ్డ కు పోషణ అవసరం, విద్య అభివృద్ధి అవకాశాలు కలిపించాలని కోరియున్నారు, మూడు నుండి ఆరు సంవత్సరాల వయసు గల పిల్లలందరికి మంచి పౌష్టికాహారం అందించాలని, శారీరక, మానసిక సామజిక అభివృద్ధి ప్రీ స్కూల్ కార్యక్రమాల ద్వారా సాధ్యమవుతుందని, ప్రీ స్కూల్ ఆక్టివిటీస్ సక్రమంగా నిర్వహించాలని ప్రతి బిడ్డ సమగ్రంగా ఎదగాలంటే మన వంతు కృషి అవసరం అని వివరించారు.

మంగపేట మండల రైతు వేదిక నందు నిర్వహించిన పోషన్ బి పడాయి బి”శిక్షణ తరగతులు కల్పనా, ఏసీడీపీఓ ఏటూరునాగారం ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమమని సులభంగా అర్ధమయ్యేలా టీచర్లకు ప్రాక్టికల్ ఆక్టివిటీస్ నిర్వహించారు. పోషణ్ 2.0 కింద బాల్య సంరక్షణ మరియు విద్య (ECCE) ను మెరుగుపరచడం మరియు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పిల్లలు నాణ్యమైన పోషకాహారం మరియు విద్య రెండింటినీ పొందేలా చూడటంపై దృష్టి పెట్టాలని వివరించారు.