calender_icon.png 10 July, 2025 | 4:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వాన్ని బద్నాం చేసే కుట్ర

27-05-2025 12:00:00 AM

అధికారులు తమ ప్రవర్తన మార్చుకోవాలి: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

ఉట్నూర్, మే26(విజయక్రాంతి): షెడ్యూ ల్ ప్రాంతంలోని గిరిజన గ్రామాల్లో పోడు భూముల సాగును అడ్డుకొని స్థానికులను భయబ్రాంతులకు గురి చేస్తున్న ఫారెస్ట్ అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. సోమవారం ఉట్నూర్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ..

నియోజకవర్గ పరిధిలో కవ్వాల్ టైగర్ జోన్ ఉన్న నేపథ్యంలో గిరిజన గ్రామాల్లో మౌలిక వసతులు కోసం ప్రభుత్వం  సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు, గిరిజనులు, గిరిజనేతరులు సాగు చేస్తున్న పోడు భూముల సాగును అడ్డుకోవడంతో పాటుగా వారిని ఎఫ్డీపీటీ శాంత రాం, ఉట్నూర్ ఎఫ్డీఓ రేవంత్ చంద్ర, సిబ్బందితో కలసి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.

గిరిజనేతరులు సాగు చేస్తున్న పోడు భూములలో మొక్కల నాటేందుకు బలవంతంగా భూములను లాక్కొని బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జిల్లా ఇన్చార్జీ మంత్రి సీతక్క, అటవీ శాఖ మంత్రి సురేఖ, పీసీసీఎఫ్, ఎమ్మెల్యేలు, ఫారెస్ట్ ఆఫీసర్లు సమా వేశంలో అభివృద్ధికి, పోడు భూముల సాగు పై సహకరించాలని, ఇతర సమస్యలపై వివరించినప్పటికీ, సదరు స్థానిక అధికారులు విని విననట్లు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.

చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న అధికారులు ప్రభుత్వ పనులు అడ్డుకోవడ మే కాకుండా, ప్రభుత్వాన్ని బద్నాం చేసే కుట్ర చేస్తున్నారని వీరిపై వెంటనే లీగల్ యాక్షన్ తీసుకొని, సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు ప్రవర్తన మార్చుకోవాలని, ఆదివాసీలపై, గిరిజనేతరులపై దౌర్జన్యాలకు పాల్పడితే, తిరుగుబాటు చేస్తే మాది బాధ్యత కాదన్నారు.

నియోజకవర్గ పరిధిలో కవ్వాల్ టైగర్ జోన్ లో ఉన్న ఫారెస్ట్ చెక్ పోస్ట్‌లను ఎత్తివేసి, అడవి పంది దాడిలో మృతి చెందిన కొడప లక్ష్మణ్ మృ తికి నైతిక బాధ్యత వహిస్తూ కుటుంబాన్ని ఫారెస్ట్ అధికారులు ఆదుకోవాలని డిమాం డ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు ఖయ్యుం, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు చంద్రయ్య, మాజీ సర్పంచ్ లు మర్సుకోల తిరుపతి, జగదీశ్ జాదవ్, నాయకులు ఎక్బాల్, అజిమొద్దీన్ ఉన్నారు.