15-09-2025 10:21:37 PM
యాజమాన్యం మొండి వైఖరి వీడాలని డిమాండ్
మందమర్రి,(విజయక్రాంతి): సింగరేణి సంస్థ 2024 - 25 ఆర్థిక సం,,లో సాధించిన వాస్తవ లాభాలను ప్రకటించి కార్మికులకు లాభాల వాటా 35 శాతం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూని యన్ (సిఐటియు) ఆధ్వర్యంలో సింగరేణి ఏరియా జిఎం కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఎస్ నాగరాజు గోపాల్ మాట్లాడుతూ లాభాల ప్రకటనలో సింగరేణి యాజమాన్యం మొండివైఖరి విడనాడి వెంటనే వాస్తవ లాభాలను ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ప్రతి సం. జూన్ జూలై నెలల్లో చెల్లించాల్సిన లాభాల వాటాను ఆర్థిక సంవత్సరం ముగిసి 5 నెలలు గడిచినప్పటికీ నేటికి చెల్లించక పోవడం దుర్మార్గం అన్నారు. మరో 15 రోజుల్లో దసరా పండుగ ఉన్నందున వెంటనే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశం నిర్వహించి వాస్తవ లాభాలను ప్రకటించి కార్మికులకు 35% తగ్గకుండా లాభాల వాటా చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. లాభాల వాటా చెల్లింపులో గుర్తింపు సంఘం, ప్రాతినిధ్య సంఘాలు కార్మికులకు అన్యాయం చేస్తున్నాయని, రెండు సంఘాల నిర్లక్ష్యంతోనే యాజమాన్యం లాభాలను ప్రకటించడం లేదని ఆయన మండిపడ్డారు.
కార్మికులకు సొంతింటి కళ అమలు చేయాలని, పెర్క్స్ పై ఐటి తిరిగి చెల్లించాలని, సెక్యూరిటీ విభాగం లోని ఖాళీలు భర్తీ చేయాలని, క్లరికల్ పరీక్షను నిర్వహించి యాక్టింగ్ ప్యానెల్ లిస్టు ప్రకారం సెప్టెంబర్ మార్చి నెల వరకు ప్రమోషన్లను ఇవ్వాలని, ట్రాన్స్ఫర్ సర్కిల్ సవరించాలని, సేఫ్టీ ట్రైపార్టీ సమావేశాలకు అన్ని యూనియన్ల ను ఆహ్వానించా లని కోరారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఏరియా పీఎం ఎస్ శ్యామ్ సుందర్ కు అంద చేశారు.