calender_icon.png 16 September, 2025 | 1:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జోరుగా అక్రమ మట్టి దందా

15-09-2025 10:38:56 PM

దేవరకొండ,(విజయక్రాంతి): కొండ మల్లేపల్లి మండల కేంద్రంలో మట్టి మాఫియా బరితెగించింది. ప్రభుత్వ అనుమతులూ తీసుకోకుండా పట్టపగలు సమయాల్లో జోరుగా మట్టి తవ్వకాలు సాగిస్తున్నారు. ఇప్పటికే లక్షల రూపాయల విలువైన మట్టిని తవ్వేశారు. ఈ తతంగం అధికారులకు తెలిసే జరుగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొండ మల్లెపల్లి మండల పరిధిలోని మల్లేపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించిన నల్లకుంట చెరువులో ఈ దందా సాగుతోంది.

అధికారులంటే భయం లేదు, ప్రజలు గమనిస్తారన్న లెక్కేలేదు,పలువురు రాజకీయ నాయకుల అండదండలు పుష్కలంగా ఉన్నాయన్న ధైర్యమో లేక తమను ఎవరేం చేస్తారన్న ధీమా కాబోలు మట్టి మాఫియా ఆగడాలకు అడ్డు అదుపులేకుండా పోతుంది. మల్లేపల్లి పట్టణంలో  మట్టి మాఫియా రెచ్చిపోతోంది. ఎలాంటి అనుమతులు లేకుండా పట్టపగలు మిట్ట మధ్యాహ్నం మల్లేపల్లి అంబేద్కర్ చౌరస్తా నుంచి ట్రాక్టర్లతో మట్టి వెళ్తున్న పట్టించుకొని అధికారులు.