calender_icon.png 16 September, 2025 | 1:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వార్డు సమస్యలను పర్యవేక్షించిన ఎమ్మెల్యే పల్ల

15-09-2025 10:43:31 PM

జనగామ,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని  28వ వార్డ్ గుండ్లగడ్డ కిష్ట బావి  గ్రీన్ పార్క్ లో పాములు దోమలు విష కీటకాలు  రావడంతో పార్క్ లో ఉన్న లోపల అంతా బురద, గడ్డివనంతో, చెత్త చెదారాలతో నిండి ఉంది. ఏ అధికారులు పట్టించుకోవడంలేదని, వార్డ్ ప్రజల విజ్ఞప్తి మేరకు  ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి వెంటనే గ్రీన్ పార్క్ ను సందర్శించి పరిసర ప్రాంతాల్ని పరిశీలించారు.  వెంటనే సంబంధిత అధికారులకు  పది రోజుల్లో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. తర్వాత కాలనీ వాసులు తో మాట్లాడుతూ.. ఈ పార్కును ఒక అందమైన ప్రదేశంగా  చేస్తానని  మహిళలు వాకింగ్ చేసే  విధంగా మరియు  పిల్లలు ఆడుకోవడానికి కావలసిన వస్తువులు,  అలాగే పార్క్ లో నీటి వసతికి ట్యాంక్, అంతేకాకుండా  మీకు ఏ సమస్య ఉన్న నేనున్నానని తెలిపారు.