calender_icon.png 16 September, 2025 | 1:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాలిటెక్నిక్‌లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే, ఇంజనీర్స్ డే

15-09-2025 10:31:15 PM

హన్మకొండ,(విజయ క్రాంతి): వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ డే, ఇంజనీర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు‌. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపాల్ బైరి ప్రభాకర్ అధ్యక్షతన నిర్వహించగా ప్రత్యేక ఆహ్వానితులుగా కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు ఈవీ శ్రీనివాస్ రావు, గౌరవ అతిధిగా నిట్ ప్రొఫెసర్ పీవీ రావు, ముఖ్య అతిధిగా సాంకేతిక విద్యాశాఖ రిటైర్డ్ ఆర్జేడీ పల్లేరు ఎల్లయ్య హాజరై జ్యోతి ప్రజ్వలన చేసారు‌. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సంధర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి దేశానికి వారు చేసిన సేవలను స్మరించుకున్నారు.

అనంతరం వారు మాట్లాడుతూ... గివ్ బ్యాక్ టూ సొసైటీ మాదిరిగా కళాశాలలో చదివి ఉన్నత స్థాయికి ఎదిగిన విద్యార్థులు కళాశాల అభివృద్ధిలో, భవిష్యత్ విద్యార్థులకు మార్గదర్శకత్వం చేయడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కళాశాల విద్యార్థులకు తాము ఎల్లవేళలా అండగా ఉంటామని తెలిపారు. ఈ సందర్భంగా నిట్ ప్రొఫెసర్ పీవీ రావు, కళాశాల సివిల్ బ్రాంచ్ మెరిట్ విద్యార్థికి రూ.5,000 నగదు ప్రోత్సాహకాన్ని అందించారు. కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు ఈవీ శ్రీనివాస్ రావు వారి తండ్రి ఇ.వి. రమణా రావు పేరిట కళాశాల టాపర్ కి రూ. 5,000- నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. ఈ ప్రోత్సాహక నగదు బహుమతిని ఇకముందు ప్రతీఏటా మెరిట్ విద్యార్థులకు అందజేస్తామని వారు తెలిపారు.

అనంతరం విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్లను, మెరిట్ విద్యార్థులకు మెడల్స్ ని అందించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కళాశాల‌ శాఖాధిపతులు గుగులోత్ మోతీలాల్, ఎస్. రవీందర్, డా. ఎ.శ్రీనాథ్, యం. శ్రీనివాస్, డా. వై.సుధ, బి. ఎల్లస్వామి మరియు కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ప్రధాన కార్యదర్శి మేకల అక్షయ్ కుమార్, కోశాధికారి ఆనంద్ కుమార్, ఓఎస్ఏ ప్రతినిధులు ఉమేందర్, సతీష్ రెడ్డి, ధర్మ శ్రీనివాస్ రెడ్డి, డీఈ రవిందర్, ఏఈ మహేందర్, ఏఈ అజీజ్ ఖాన్, భిక్షపతి, దొడ్డిపల్లి కుమార్, పూర్ణచందర్, ఎగ్గిడి వేణు, కళాశాల విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.