15-09-2025 10:26:48 PM
కార్మికుల హక్కులు, ప్రయోజనాలే ముఖ్యం
ఏఐటియుసి అడిషనల్ జనరల్ సెక్రటరీ మిర్యాల రంగయ్య
మణుగూరు,(విజయక్రాంతి): స్ట్రక్చర్ కమిటీలో జరిగిన ఒప్పందాలు సర్క్యులర్లు జారీ చేయకుండా జాప్యం చేయడం సింగరేణి యాజమాన్యానికి అలవాటుగా, అలసత్వంగా మారిందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి) అడిషనల్ జనరల్ సెక్రటరీ మిర్యాల రంగయ్య ఆరోపించారు. సోమవారం ఏరియాలోని పీకేఓసిటులో యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి వై.రాంగోపాల్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
గత సంవత్సర కాలంలో రెండు సార్లు డైరెక్టర్(పా)తో, ఒకసారి సింగరేణి సి ఎండి తో సమావేశాలు జరిగిన ప్పటికీ, ఒప్పుకున్న అంశాలపై సైతం ఉత్తర్వులు జారీ చేయకుండా, కాలయాపన చేయడం, మితిమీరిన రాజకీయ జోక్యంతో కార్మిక సమస్యలను పక్కదారి పట్టించడం చేస్తున్నారని, సింగరేణి భవన్ లో జరిగిన స్ట్రక్చర్ సమావేశాన్ని యాజమాన్యం మొండివైఖరికి నిరసనగా బహిష్కరించడం జరి గిందన్నారు. యాజమాన్యం కార్మికుల సమస్యలను పరిష్కరిం చేందుకు ఏర్పాటు చేసిన స్ట్రక్చర్ సమావేశాల్లో ఒప్పు కుని అమలు చేయడం లేదని విమర్శించారు.
ముఖ్యంగా సింగరేణిలో కార్మికుల స్వంత ఇంటి పథకంపై యాజమాన్యం వేసిన కమిటీ ఇంత వరకు ఒక సమావేశం జరుగలేదని, మెడికల్ బోర్డు విషయంలో పది సంవత్సరాల నుండి కొనసాగిన ఆనాడు లేని ఏసీబీ ని బూచిగా చూపి, బోర్డు ఆపడం యాజమాన్యం చేసిన తప్పు అన్నారు. గతంలో లాగా మెడికల్ బోర్డు పెట్టాలని డిమాండ్ చేశారు. సింగరేణికి 2024-2025 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన వాస్తవ లాభాలు ప్రకటించి, అందులో నుండి కార్మికులకు 35 శాతం వాటా ప్రకటించాలని డిమాండ్ చేయడం జరి గిందని, కానీ యాజమాన్యం ప్రక టించకుండా కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. సింగరేణిలో కొత్త ప్రాజెక్టులను ప్రైవేటు వారికి కట్టపెట్టాలని ప్రభు త్వం, యాజమాన్యం ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు.
ఉన్న ప్రాజెక్టులు మూతపడడం, నూతన ప్రాజె క్టులు రాకపోవడం వలన కార్మికులు ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు, కొత్త బొగ్గు బావుల కోసం సింగరేణి వేలంలో పాల్గొనాలని డిమాండ్ చేశారు. మణుగూరు ఏరియాలో అపారమైన బొగ్గు నిల్వలు ఉన్నాయని ఏరియాకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉందని చైర్మన్ సందేశం సత్య దూరం అని అన్నారు. పీకే ఓసి టు డిప్ సైడ్ పర్మిషన్ కోసం ప్ర యత్నం చేయాలని, అప్పుడే ఏరియాకు భవిష్యత్తు ఉంటుందని, పేర్కొన్నారు. కార్మికుల హక్కులు, ప్రయోజనాలే లక్ష్యంగా యూనియన్ పని చేస్తుందన్నారు. ఇప్పటికైనా యాజమాన్యం కార్మికుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని, కాల యాపన చేస్తే ఏఐటియుసి ఆద్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు.