calender_icon.png 28 November, 2025 | 7:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమర్‌సింగ్ చంకీలకు ఎమ్మీలో నిరాశ

26-11-2025 12:07:18 AM

పంజాబీ గాయకుడు, నటుడు దిల్జీత్ దోసాంజ్, పరిణీతి చోప్రా ప్రధాన పాత్రల్లో నటించిన ‘అమర్‌సింగ్ చంకీల’ చిత్రానికి నిరాశ ఎదురైంది. న్యూయార్క్ లో జరిగిన 23వ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డ్స్‌లో ఇండియా తరపున ఈ చిత్రం రెండు విభాగాల్లో.. ఉత్తమ మినీ సిరీస్, ఉత్తమ నటుడు కేటగిరీలో నామినేషన్ దక్కించుకుంది.

ఏ అవార్డునూ సొంతం చేసుకోలేదు. ఉత్తమ మినీ సిరీస్ విభాగంలో ‘లాస్ట్ బాయ్స్ అండ్ ఫెయిరీస్’ విజేతగా నిలువగా, ఉత్తమ హీరోగా ఓరియోల్ ప్లాకు అవార్డు వరించింది. 27 ఏళ్ల వయసులోనే హత్యకు గురైన పంజాబీ గాయకుడు అమర్ సింగ్ చంకీల జీవితం ఆధారంగా ఈ సినిమాను ఇంతియాజ్ అలీ తెరకెక్కించగా, ఏఆర్ రెహమాన్ స్వరాలు అందించారు. పాత్ర కోసం పరిణీతి దాదాపు 30 కిలోల బరువు తగ్గారు. ఓ పాట కూడా పాడారు.