calender_icon.png 28 November, 2025 | 7:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పతంగ్.. కథే హీరో!

26-11-2025 12:09:04 AM

కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడంలో ముందుండే సురేశ్ ప్రొడక్షన్స్ అధినేత, ప్రముఖ నిర్మాత డీ సురేశ్‌బాబు తాజాగా ‘పతంగ్’ చిత్రబృందంతో చేతులు కలిపారు. సురేశ్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఈ సినిమా డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. పతంగుల పోటీ నేపథ్యంలో రూపుదిద్దుకున్న కామెడీ స్పోర్ట్స్ డ్రామా ఇది. సినిమాటిక్ ఎలిమెంట్స్ అండ్ రిషన్ సినిమాస్ పతాకంపై విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మక, సురేశ్ కొత్తింటి, నాని బండ్రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకత్వం వహించారు.

ఈ చిత్రంలో ఇన్‌స్టాగ్రామ్ సెన్సేషన్ ప్రీతి పగడాల, జీ సరిగమప రన్నరప్ ప్రణవ్ కౌశిక్‌తోపాటు వంశీ పూజిత్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ సింగర్, నటుడు ఎస్‌పీ చరణ్ ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. మరికొందరు నూతన నటీనటులు ఇందులో భాగమయ్యారు. ఈ సినిమాకు కథే హీరో అంటూ ఇప్పటికే చూసిన సినీప్రముఖులు ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రానికి జోస్ జిమ్మి సంగీతం అందించారు.