26-11-2025 12:04:59 AM
హీరో నవీన్ పొలిశెట్టి నటిస్తున్న తాజాచిత్రం ‘అనగనగా ఒక రాజు’. 2026, సంక్రాంతి కానుకగా విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించడంతో ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ వాయిదా వేస్తారేమో అని అంతా అనుకుంటున్న తరు ణంలో మేకర్స్ తాజాగా ఓ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. ‘భీమవరం బల్మ’ అంటూ సాగే ఈ పాటను నవంబర్ 27న విడుదల చేయనున్నట్టు వెల్లడించారు.
కాగా ఈ పాటను పాడింది కూడా నవీన్ పొలిశెట్టి కావడం విశేషం. మారి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి ఔట్ అండ్ ఔట్ కామెడీ రోల్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు.