calender_icon.png 4 August, 2025 | 2:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులను మందలించాడని హాస్టల్ వార్డెన్ పై బంధువుల దాడి

03-08-2025 10:53:59 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగరం లోని ప్రభుత్వ ఆశ్రమ బాలుర పాఠశాలలో వార్డెన్ గా విధులు నిర్వహిస్తున్న భూక్యా బాలాజీ తన విధుల్లో భాగంగా శనివారం హాస్టల్ రూమ్ లను తనిఖీ చేస్తుండగా ఇద్దరు విద్యార్థులు న్యూసెన్స్ చేస్తుండడంతో మందలించాడు.

మీ ప్రవర్తన సరిగా లేదని తల్లిదండ్రులను తీసుకురమ్మని చెప్పగా, ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో విద్యార్థులకు అల్పాహారం వడ్డిస్తున్న సమయంలో వార్డెన్ మందలించిన సదరు విద్యార్థుల కుటుంబ సభ్యులు హాస్టల్ కు వచ్చి వార్డెన్ విధులకు ఆటంకం కలిగిస్తూ అతన్ని బూతులు తిడుతూ చేతులతో దాడి చేసి కొట్టారు. ఈ ఘటనపై హాస్టల్ వార్డెన్ గూడూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వార్డెన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ గిరిధర్ రెడ్డి తెలిపారు.