calender_icon.png 4 August, 2025 | 2:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉరి వేసుకొని బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

03-08-2025 10:49:47 PM

కుత్బుల్లాపూర్,(విజయక్రాంతి): సెమిస్టర్ ఎగ్జామ్ లో మార్కులు తక్కువ వచ్చాయని మనస్థాపనకి గురైన బీటెక్ విద్యార్థి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కి చెందిన రమేష్ (54) సెక్యూరిటీగా పనిచేస్తూ అతని కుటుంబంతో కలిసి షాపూర్ సంజయ్ గాంధీ నగర్ లోని నివాసముంటున్నాడు. అతని కుమారుడు అక్షయ్ (19) ఎంఎల్ఆర్ కాలేజ్ లో బీటెక్ చదువుతున్నాడు. శనివారం మధ్యాహ్నం 1 గంటల సమయంలో ఫ్యాన్ కు బెడ్ షీట్ తో ఉరి వేసుకొని అక్షయ్ ఆత్మహత్య చేసుకున్నాడు. తన తండ్రి విధులు ముగించుకొని ఇంటికి వచ్చి చూడగా ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించాడు. తన చావుకు కారణం సెమిస్టర్ మార్కులు తక్కువ రావడంతో ఆత్మహత్య చేసుకుంటున్నానని లెటర్ రాశాడు.ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు.