03-08-2025 10:41:52 PM
కల్తీ కల్లు సేవించి మహిళా మృతి
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): కల్తీ కల్లు సేవించి మహిళా మృత్యుత్ చెందిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం యన్మన్ బెట్ల గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మరాఠీ మంగమ్మ (45) ఆదివారం గ్రామంలోని కల్లు దుకాణం వద్ద కల్లు సేవించి కొద్ది సేపటికి బయటికి వస్తుండగా స్పృహ తప్పి పడిపోయి మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు గ్రామస్తులు కోపంతో ఓగిపోయి కళ్ళు దుకాణం పై దాడి చేశారు సీసలు ట్రేలను ధ్వంసం చేశారు విషయం తెలుసుకున్న ఎక్సైజ్ అధికారులు కల్లు దుకాణంలోని కల్తీకల్లును శాంపిల్ సేకరించి కల్లు దుకాణాన్ని సీజ్ చేశారు. ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్ నియోజకవర్గం లోని కల్తీకల్లు రాజమౌళితోందని దుకాణదారులు అక్రమంగా కల్తీకల్లు తయారుచేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని కల్తీ కల్లు దుకాణాలపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.