03-08-2025 11:02:19 PM
చండూరు,(విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం ముదివేన్ గ్రామానికి చెందిన యువకుడు అర్థం అమరేష్ కుమార్ కు హార్షధర్మ సేవారత్న అవార్డు లభించింది. లలితకళ సమైక్య సేవా సంస్కృతిక సంస్థ త్యాగరాయ గాన సభ చిక్కడపల్లిలో నిర్వహించిన వేడుకలో ఈ అవార్డును అందుకున్నారు.
అమరేష్ అందిస్తున్న సేవలను గుర్తించి అవార్డు కమిటీ ఈ గౌరవాన్ని అందజేసింది. ఈ సందర్భంగా ఆయన సేవలను ప్రశంసిస్తూ గ్రామస్థులు, స్థానిక నాయకులు, బంధుమిత్రులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన గట్టుప్పల్ వార్త రిపోర్టర్ సిద్ధగోని మహేష్ అర్థం అమరేష్‌ను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్పందించిన అమరేష్ కుమార్ మాట్లాడుతూ... ఈ అవార్డు నాకు పెద్ద గౌరవం. ఈ గుర్తింపు నాకు మరింత బాధ్యతను కలిగించింది. మా గ్రామానికి పేరు తీసుకురావడమే నా ధ్యేయం" అని తెలిపారు.