calender_icon.png 4 August, 2025 | 2:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సబ్ జైల్లో స్నేహితుల దినోత్సవం

03-08-2025 10:14:45 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ సబ్ జైల్లో ఆదివారం స్నేహితుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జైలర్ మల్లెల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఉద్యోగులు పరస్పరం స్నేహ భావానికి ప్రతీకగా ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టుకున్నారు. స్నేహం ఒక్కటే కులమత, ప్రాంత, భాషా బేధాలకు తావివ్వని ఆత్మీయ బంధమన్నారు. ఈ కార్యక్రమంలో సిటిజన్ ఫోరం సభ్యులు శంతన్ రామరాజు, జైలు సిబ్బంది సదానిరంజన్, బోడ వెంకన్న, ఖలీల్, మురళి, వీరన్న పాల్గొన్నారు.