calender_icon.png 4 August, 2025 | 2:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలో మొదటి దళిత జర్నలిస్టుల కమిటీ ఎన్నిక

03-08-2025 10:58:38 PM

అధ్యక్షుడు చెట్టుపల్లి స్నేహకుమార్

మంగపేట,(విజయక్రాంతి): ములుగు జిల్లా మంగపేట మండలం రాజుపేటలో ఆదివారం రోజు తెలంగాణ దళిత వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మంగపేట మండల కమిటీ ఎన్నిక సమావేశంను నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం తెలంగాణ దళిత వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మంగపేట మండల అధ్యక్షులు చెట్టిపల్లి స్నేహకుమార్ ఉపాధ్యక్షులు ఉగ్గుమల్ల గణేష్ ప్రధాన కార్యదర్శి ఈసంపల్లి సురేందర్ కార్యదర్శి ఎర్ర శ్రవణ్ కుమార్ సహాయ కార్యదర్శి బోడ ప్రవీణ్ ఎన్నిక అయ్యారు.ఈ సమావేశంలో గౌరవ సలహాదరులు దళిత సీనియర్ జర్నలిస్ట్ నిమ్మగడ్డ శ్రీనివాస్ మైప శంకర్ పరికి శ్రీనివాస్ సలహాలు సూచనలు ఇచ్చారు త్వరలో జిల్లా కమిటీ కూడా ఎన్నిక జరుగుతుందని తెలిపారు