calender_icon.png 27 October, 2025 | 4:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబేద్కర్ జీవితం అందరికీ ఆదర్శం

27-10-2025 01:46:59 AM

అంబేద్కర్ ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నత్తి మైసయ్య

మేడిపల్లి, అక్టోబర్ 26 (విజయక్రాంతి):అంబేద్కర్ ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నత్తి మైసయ్య ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి 349వ ఆదివారం జ్ఞానమాల సమర్పించి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నత్తి మైసయ్య మాట్లాడుతూ తన మేధస్సును, తన జీవితాన్ని భారతీయుల కోసం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం దార పోసిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని, బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన  మొదటి రౌండు టేబుల్ సమావేశంలో పాల్గొన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ దళిత, పీడిత, బడుగు, బలహీన వర్గాల దుర్భర పరిస్థితిని,

నాటి బ్రిటిష్  ప్రభుత్వానికి వివరించి  బ్రిటిష్ పత్రికలు సైతం అభినందించే విధం గా చేసిన మహోన్నత వ్యక్తి, అపర మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అన్నారు. ఈ కార్యక్రమంలో రాపోలు శ్రీరాములు, గరుగుల యాకయ్య, సగ్గు నరసిం హ, వై శ్రీనివాస్, బండారి సాయి, ఏ రాజే ష్, యేసు రాజు, టిల్లు తదితరులు పాల్గొన్నారు.