calender_icon.png 27 October, 2025 | 4:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రత గాలికి!

27-10-2025 01:46:16 AM

ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ అధికారుల కొరడా

-అగ్నిమాపక యంత్రాలు లేకుండానే ప్రయాణం

-హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌లో విస్తృత తనిఖీలు

హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 26 (విజయక్రాంతి): ప్రయాణి కుల భద్రతను గాలికొదిలేసి, నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్న ప్రైవే ట్ కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులపై రవా ణా శాఖ అధికారులు కొరడా ఝుళిపించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో ఆదివారం నిర్వహించిన తనిఖీల్లో కనీస భద్రతా ప్రమాణాలు పాటించని పలు బస్సులపై కేసులు నమోదు చేసి, భారీగా జరిమానాలు విధించారు.

ముఖ్యంగా బస్సుల్లో తప్పనిసరిగా ఉండాల్సిన అగ్నిమాపక యంత్రాలు  లేకపోవడం, డ్రైవర్లు యూనిఫాం ధరించకపోవడం వంటి ఉల్లంఘనలను గుర్తించారు. రంగారెడ్డి జిల్లా డీటీసీ అధికారులు జరిపిన తనిఖీల్లో అగ్నిమాపక యంత్రాలు లేని 7 బస్సులపై కేసులు నమోదు చేసి, రూ.35 వేల జరిమానా విధించారు.

ఆర్టీఏ సౌత్ జోన్ అధికారులు 11 బస్సులపై కేసులు నమోదు చేశారు. యూనిఫాం లేకపోవడం, ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు లేకపోవడం వంటి ఉల్లంఘనలకు గాను రూ.31 వేల జరిమానా వసూలు చేశారు. ఆర్టీఏ ఈస్ట్ జోన్ పరిధిలో 3 కేసులు నమోదు చేసి, రూ.3 వేల జరిమానా విధించారు.మొత్తం మీద ఒక్కరో జులోనే 21 కేసులు నమోదు చేసి, రూ.69 వేల జరిమానా వసూలు చేశారు.