calender_icon.png 31 August, 2025 | 2:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రంప్ సుంకాల దెబ్బకు.. అమెరికన్ల పెడబొబ్బలు

31-08-2025 12:00:00 AM

  1. బూమరాంగ్ అయిన ట్రంప్ సుంకాలు
  2. అమెరికన్లకు ఇప్పటికే కరెంట్ షాక్
  3. సుంకాల దెబ్బతో పెరిగిన నిత్యావసరాల ధరలు
    1. కుర్చీ ఎక్కాక ఎన్నో వివాదాస్పద నిర్ణయాలు

న్యూఢిల్లీ, ఆగస్టు 30: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల మోత మోగి స్తున్నారు. ప్రపంచంలోని చాలా దేశాలపై అదనపు సుంకాలు విధించారు. వివిధ దేశా ల నుంచి అమెరికా దిగుమతి చేసుకునే వస్తువులపై ఈ సుంకాల ప్రభావం పడింది. దీంతో ఆ వస్తువుల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ధరల పెరుగుదలతో సా మాన్య అమెరికన్లు గుండెలు బాదుకుంటున్నారు.

ఇంత జరుగుతున్నా ట్రంప్ తన తీరు ను మాత్రం మార్చుకోవడం లేదు. సుంకాల విషయంలో వెనక్కి తగ్గడం లేదు. మొదటిసారి అధ్యక్షుడిగా గెలిచినపుడు ట్రంప్ సుం కాల ప్రభావం పెద్దగా లేకపోయినా ఎప్పుడైతే ఆయన రెండో దఫా అధ్యక్షుడిగా ప్రమా ణస్వీకారం చేశారో అప్పటి నుంచి ప్రపంచం తో పాటు సామాన్య అమెరికన్లను కూడా బెంబేలెత్తిస్తున్నారు. 

గెలిచానో ధరలు తగ్గిస్తా

అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే ధరలు తగ్గిస్తానని ట్రంప్ 2024 ఎన్నికల ప్రచారంలో హామీనిచ్చారు. ట్రంప్ అధికారంలోకి వచ్చి న తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ‘మేక్ అమెరికా అఫర్డబుల్ అగైన్’ అని నినాదం ఇచ్చిన ట్రంప్ ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలతో అమెరికన్లు అఫర్డ బుల్ చేయలేని స్థాయికి ధరలు చేరుకున్నా యి. ట్రంప్ అధ్యక్ష పీఠం అధిరోహించిన తర్వాత నుంచి అమెరికన్లు సరుకులు, విద్యుత్, గృహఅవసరాలపై చేసే ఖర్చులు పెరుగుతూ పోతున్నాయని ఆర్థిక వేత్తల వెలువరించిన పలు నివేదికలు చెబుతున్నాయి.

అమెరికాలో మునుపెన్నడూ లేని విధంగా ధరలు పెరగడానికి ట్రంప్ ప్రపంచదేశాలపై విధిస్తున్న సుంకాలే ప్రధాన కార ణంగా ఉన్నాయి. సుంకాల పెంపు మాత్రమే కాకుండా ట్రంప్ పరిపాలన కాలంలో ‘డి మినిమిస్’ రూల్‌ను తొలగించారు. ఇది కూ డా ధరల పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది.దీని వల్ల అమెరికన్ వినియోగ దారులు 800 డాలర్ల విలువ గల సరుకులను దిగుమతి చేసుకునేందుకు ఈ నియ మం వీలు కల్పిస్తుంది.

కానీ ట్రంప్ అధ్యక్షుడయిన తర్వాత ఈ రూల్‌ను ఎత్తేయడంతో ఉచితంగా దిగుమతి చేసుకునే సౌలభ్యాన్ని కోల్పోయారు.  దీని ద్వారా ఆన్‌లైన్‌లో చౌక ధరలకు సరుకులు కొనుగోలు చేసే వారిపై అధిక ప్రభావం పడింది. అంతే కాకుండా కొన్ని రకాల వస్తువుల కొరతకు కూడా ఇది కారణం అయ్యే అవకాశం కూడా ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు. 

సేవలు బంద్ చేసిన పోస్టల్ డిపార్ట్‌మెంట్

ట్రంప్ సుంకాల ప్రభావంతో భారతీయ పోస్టల్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 25 నుంచి అమెరికాకు కన్‌సైన్‌మెంట్లను నిలిపివేసింది. ఎవరైనా అమెరికాకు కన్‌సైన్‌మెంట్లు పంపేందుకు ఇండియా పోస్ట్‌కు వస్తే వారు తిరస్కరించడం మొదలుపెట్టారు. కేవలం ఇండియా పోస్ట్ మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 25 దేశాలు కన్‌సైన్‌మెంట్ డెలివరీలు నిలిపివేశాయి.

పోస్టల్ డిపార్ట్‌మెంట్లు ఇలా నిలిపివేసేందుకు ‘డీ మినిమిస్’ రూల్ ఎత్తేయడం ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ 25 దేశాల్లో ఉండే విక్రేతలు అమెరికాకు ఆర్డర్లు పంపడం బంద్ చేశారు. దీంతో అమెరికాలో సంబంధిత వస్తువుల ధరలు భారీగా పెరిగిపోయాయి. ఇది సామాన్య అమెరికన్లకు గుదిబండగా మారింది. 

ట్రంప్‌కు ధన్యవాదాలు

ఈ సుంకాల ప్రభావం అమెరికన్లపై పడటం మొదలైన తర్వాత ట్రంప్‌పై విమర్శల దాడి ఎక్కువ అయింది. వాషింగ్టన్ సెనెటర్ పాటీ ముర్రే ఎక్స్ వేదికగా ట్రంప్‌ను విమర్శించారు. ‘1933 తర్వాత అమెరికన్లు అత్యధిక సుంకాలు చెల్లిస్తున్నారు. సగటున చూసుకుంటే ఒక సాధారణ కుటుంబం ఏడాదికి 2,400 డాలర్లు నష్టపోతుంది. అమెరిన్లను ఇలా మార్చినందుకు ట్రంప్‌కు ధన్యవాదాలు. ట్రంప్ విధానాల కారణంగానే మీరు ప్రతిదానికి ఎక్కువగా చెల్లించాల్సి వస్తోంది’ అని విమర్శించారు. 

అమెరికన్లను ఒత్తిడికి గురి చేస్తున్న ధరల పెరుగుదల.. 

నిత్యావసరాలతో పాటు అన్ని రకాల ధరలు పెరిగిపోవడంతో అమెరికన్లు ఒత్తిడికి గురవుతున్నారు. సామాన్య కుటుంబాలు కిరాణా ధరల పెరుగుదలతో ఒత్తిడికి లోనవుతున్నారు. యూఎస్‌డీఏ ఎకనామిక్ రీసెర్చ్ సర్వీస్ తాజా నివేదిక ప్రకారం.. జూన్, జూలై మధ్యకాలంలో సీపీఐ (కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్) 0.2 శాతం మేర పెరిగింది. ఈ పెరుగుదల మొత్తం ద్రవ్యోల్బణానికి అనుగుణంగానే ఉన్నా.. ఇటీవలి కాలంలో పెరుగుతున్న ధరలను ఇది సూచిస్తుంది. ఈ ఏడాది చివరి నాటికి 3.4 శాతం మేర పెరుగతాయని ఈ నివేదిక అంచనా వేసింది.

గత 20 ఏండ్ల సగటు 2.9 శాతం కంటే ఇది ఎక్కువగా ఉండడం గమనార్హం. గుడ్లు, బీఫ్ అని మాత్రమే కాకుండా అన్ని రకాల వస్తువుల శ్రేణుల్లో అస్థిరత రాజ్యమేలింది. అందువల్లే ఇంతలా పెరుగుదల కనిపించింది. పశువులకు వ్యాధులు సోకడం పశువుల సంఖ్య తగ్గిపోవడం కూడా ధరల పెరుగుదలకు దారి తీసింది.  53 శాతం మం ది అమెరికన్లు వినియోగ వస్తువుల ధరల పె రుగుదలతో తీవ్ర ఒత్తిడికి, 33 శాతం మంది ఒక మాదిరి ఒత్తిడికి లోనవగా..

మరో 14 శా తం మంది ఇది అసలు విషయమే కాదని కొట్టిపారేశారు. తక్కువ ఆదాయ వర్గాలు ఈ ధరల పెరుగుదలతో ఎక్కువగా సతమతం అవుతున్నారు. ఏడాదికి 30 వేల డాలర్ల కంటే తక్కువ సంపాదించే వారిలో 64 శాతం మంది కూరగాయలు, కిరాణా సామగ్రి అధిక ఒత్తిడికి కారకంగా, ఏడాదికి లక్ష డాలర్ల లోపు సంపాదిస్తున్న వారిలో 44 శాతం మంది కూరగాయలు, కిరాణాసామగ్రి ఒత్తిడికి కారణాలని పేర్కొన్నారు. 

పెరిగిన విద్యుత్ చార్జీలు

అమెరికాలో 2020 నుంచి విద్యుత్ బిల్లులు 34 శాతం మేర పెరిగాయి. ఈ పెరుగుదల సామాన్యులకు తీవ్ర ఇబ్బందిగా మా రింది. కేవలం విద్యుత్ బిల్లులు అని మాత్ర మే కాకుండా అన్ని రకాల వస్తువుల ధరలు అందనంత ఎత్తులో పెరుగుతూ పోతున్నా యి. దీంతో సామాన్య అమెరికన్లు తీవ్ర ఇక్క ట్లు పడుతున్నారు. ఇప్పటికే నిరుద్యోగం వం టి ఇతర సమస్యలతో బాధపడుతున్న అమెరికన్లను ట్రంప్ సుంకాలు మరింత భయాం దోళనకు గురి చేస్తున్నాయి. మరి ట్రంప్ దొ ర వారు ఇలాగే సుంకాలు విధించుకుం టూ వెళ్తే అమెరికన్లకు పెద్ద దెబ్బే. 

‘బిగ్ బ్యూటిఫుల్ బిల్’ నిజంగానే బ్యూటిఫుల్‌గా ఉందా? 

ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత చాలా రోజుల వరకు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ట్రంప్ వెంటే ఉంటూ వచ్చారు. అంతే కాకుండా ప్రభుత్వ ఖర్చులను తగ్గించేందుకు ‘డోజ్’ అనే వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. డోజ్ అనేక నిర్ణయాలు తీసుకుంది. అందులో కొన్ని నిర్ణయాలు వివాదాస్పదం కూడా అయ్యాయి. అలా ట్రంప్ బంధం కొనసాగింది. కానీ అమెరికా ప్రభుత్వం ‘బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్’ తీసుకొచ్చింది. దీంతో ఈ ఇద్దరి మధ్య పొరపొచ్చాలు వచ్చాయి.

ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు పలు కంపెనీలకు ఇస్తున్న రాయితీలను ఈ బిల్లు ద్వారా ఉపసంహరించుకున్నారు. ప్రధానంగా ఎలక్ట్రిక్ వాహనాలకు ఇచ్చే సుంకాలను మినహాయించారు. దీంతో మరిన్ని చిక్కులు వచ్చాయి. ఇలా ఒక్క రంగాన్ని మాత్రమే కాకుండా ట్రంప్ తన నిర్ణయాలతో అమెరికాలో ఉన్న అన్ని రంగాలను ప్రభావితం చేశారు. అన్ని రంగాలు ట్రంప్ దెబ్బకు కుదేలయ్యాయి. 

ట్రంప్ టారిఫ్‌లతో అమెరికన్లకు కష్టమే.. 

కెనడా, మెక్సికో, చైనాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై ప్రధానంగా ట్రంప్ సుంకాల ప్రభావం ప డింది. ఈ దేశాల నుంచి అమెరికాకు కీలక వస్తువులు దిగుమతి అవుతున్నాయి. సుంకాల ప్రభావంతో ఈ దిగుమతులు భారీగా తగ్గాయి. దీం తో అమెరికాలోని వ్యవసాయ ఉత్పత్తులు భారీగా ప్రభావితం అయ్యా యి. ఈ దేశాల దిగుమతుల మీదే అమెరికాలోని వ్యవసాయ ఉత్పత్తులు ఆధారపడి ఉన్నాయి.