calender_icon.png 21 June, 2025 | 9:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎర్రపహాడ్ పీహెచ్సి లో అమ్మ ఒడి కార్యక్రమం

03-03-2025 05:37:47 PM

తాడువాయి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం అమ్మ ఓడి కార్యక్రమం నిర్వహించినట్లు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అర్జుమన్ నజీరా తెలిపారు. గర్భిణీ మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. రక్త పరీక్షలు అవసరం ఉన్న గర్భిణీ మహిళల రక్త నమూనాలను సేకరించి తెలంగాణ డయాగ్నస్టిక్ కేంద్రానికి పంపామన్నారు. గర్భిణీలు పౌష్టికారం తీసుకొని ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గర్భిణీలు ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.