02-01-2026 12:00:00 AM
పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత
ఎల్లంపేట సర్పంచ్ గండి రాధమ్మ
మరిపెడ, జనవరి1(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేట త్రీ అంగన్వాడి కేంద్రం నందు శానిటేషన్, ఆరోగ్యం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎల్లంపేట సర్పంచ్ గండి రాధమ్మ ఐసిడిఎస్ సూపర్వైజర్, ఉషారాణి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాల ద్వారా శానిటే షన్ అవగాహన కార్యక్రమాలు పిల్లలు తల్లులకు వ్యక్తిగత పరిశుభ్రత, పరిశుభ్రమైన తాగునీరు మరుగుదొడ్ల వాడకం ఆహార శుభ్రత వంటి ముఖ్యమైన అంశాలపై అవగాహన కల్పించారు.
చిన్నపిల్లలకు ఆరోగ్యకరమైన అలవాట్లను చిన్నప్పటి నుంచే నేర్పించాలని అన్నారు.తల్లులకు బాలామృతం టి హెచ్ ఆర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ ఉషారాణి అంగన్వాడి టీచర్ విజయ కుమారి, నవనీత, శ్రీమతి, ఆశ వర్కర్ తల్లులు, గర్భిణీలు పాల్గొన్నారు.