02-01-2026 12:00:00 AM
ప్రభుత్వానికి కట్టిన సొమ్ము చెల్లిస్తామంటూ ప్రభుత్వం ప్రకటన
2009 - 2016 మధ్య అమలు 2018లో నిలిపివేత
స్వయం సహాయ మహిళల నుంచి రూ.1600 కోట్లపైగా వసూలు
21 లక్షల మంది సభ్యులకు ఊరట
అశ్వారావుపేట, జనవరి 1(విజయక్రాంతి): తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ర్పాటు చేసిన ప్రకటన, అభయహస్తం ప ధకం స్వయం సహాయక సభ్యుల్లో ఆశలను రేకెత్తిస్తుంది. తెలంగాణ ఏర్పడిన తరువాత అభయహస్తం పథకం నిలిపివేయడమే కా కుండా అప్పటి వరకు మహిళలు ప్రభుత్వానికి కట్టిన సొమ్ములను సభ్యులకు తిరిగి చె ల్లించని సొమ్ములను తిరిగి చెల్లిస్తామని ప్ర భుత్వం చేసిన ప్రకటన మహిళలో హర్షాతిరేకం వ్యక్తం అవుతుంది. ప్రభుత్వం చేసిన ప్ర కటన అమలులోకి వస్తే దాదాపు 21 లక్షల మంది మహిళలకు ప్రయోజనం కలగనుం ది.వివరాలలోకి వెళితే ఈ విదంగా ఉన్నా యి. అభయహస్తంలో 21లక్షల మంది రూ 1600కోట్లకు పైగ పొదువు 2009, నవంబర్ 1న అప్పటి ప్రభుత్వం అభయహస్తం పించన్ పథకంనుమహిళలకు ఆదాయ భద్రత కల్పించే ఉద్దేశ్యంతో ప్రారంభించింది. ఈ పధకాన్ని ఉభయసభల ఆమోదంతో చట్టం చేసారు.
ఈ పథకం లోచేరడానికి 18-59 సంవత్సరాల మధ్య వున్న స్వయంస హాయ సంఘాల మహిళలు అర్హులుగ గు ర్తించారు. ప్రతి సభ్యులు రోజుకి ఒక్కరూపాయి చొప్పున నెలకు రూ.30లు ఈ పథ కం లోపొదుపు చేసుకునేలా పథకాన్నిరూపొందించారు. 60 సంవత్సరాలు నిండిన తరువాత మహిళలకు నెలకు రూ.500 తగ్గకుండా పొదువును కట్టి నెలకు రూ.5000వ లకు పైగ పించన్ వచ్చేలా ఈ పథకాన్ని పొందించారు. 2016 వరకు ఈ పథకం రాష్ట్రంలో అమలులో ఉంది. అప్పటి వరకు ప్రతినెల మహిళలు ప్రతి నెల సొమ్ములు చెల్లిస్తూ వచ్చారు. 2016 నుండి ఈ పథకం లో డబ్బులుకట్టించుకోవడం నిలిపివేసారు. ఆ రోజు వరకు రాష్ట్ర వ్యాప్తంగ 21 లక్షల మంది సభ్యులుగ ఉన్నట్టు సమాచారం.
వీరు సుమారుగ రూ.1000 కోట్లకు పైగ ఈ పథకంలో మహిళలు పొదుపుచేసుకున్న సొమ్ము నిల్వ ఉంది. ఈ పథకంలో చేరిన మహిళలకు 60 సం.లు దాటిన మహిళలకు నెలకు కనీన పించన్ రూ.500 నుండి పొదువు చేసిన సొమ్మును బట్టి పించనన్ను తిరిగి చెల్లించాల్సి ఉంటుంది అంతేకాక ఈ సభ్యులకు జనశ్రీ భీమా యోజన వడకం ద్వార సహజంగ మరణిస్తే రూ.35వేలు, ప్రమాదులో మరణిస్తే రూ.75వేలు, శాశ్వత అంగవైకల్యం కురూ.75వేలు, పాక్షిక అంగవైకల్యంకు రూ.37,500ల చొప్పున చెల్లించే వారు. వీటితో పాటు, శిక్ష సహయోగ్ యోజన పథకం ద్వార సభ్యుల సంతానం 8.9.10, ఇంటర్ ,ఐటీఐచదివే పిల్లలుంటే వారికి ఏడాదికి రూ.1200 స్టైఫండ్ చెల్లించేవారు.
ఈ విదమైన బహుళ ప్రయోజనాలు కలగి ఉండటంతో ఈ పథకం లోమహిళలు విస్తృతంగా చేరారు. అనేక మంది ఈ పథకంద్వార బీమా, ఉపకారవేతనాలను పొం దారు.2018లో రద్దు చేసిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత 2016లో 60 నంలు దాటినవారికి రూ. 1000 పించ న్ ఇస్తుండటంతో అభయహస్తం పించనను రద్దు చేసి వారందరిని సామాజిక పించన్లలో కలిపేసింది. ఈ పథకం ద్వార పొ దువును నిలిపివేసింది. ఇంత వరకు బాగానే ఉన్న అ ప్పటి వరకు సుమారు 21 లక్షల మంది మ హిళలు ఈ పథకం లో పొదుపు చేసుకున్న రూ 1600 కోట్లు సొమ్ముపై ఏ విధమైన ని ర్ణయంతీసుకోలేదు.
కాంగ్రెస్ ఏర్పాటు చేసిన తరవాత సీఎం రేవంత్ రెడ్డి అభయ హస్తం ద్వార మహిళలు పొదుపు చేసుకున్న సొ మ్మును వడ్డీతో సహ తిరిగి చెల్లిస్తామని, వీ టికి సంబందించి నివేదికను తయారు చేస్తున్నట్లు చేసిన ప్రకటనమహిళల్లో ఆశలను రేకిస్తున్నాయి. అదే అమలు జరిగితే 21 ల క్షల మంది మహిళలకు ప్రయోజనంకలుగుతుంది. ఇప్పటికే వేలాది మంది మహిళలు మరణించారు. ఈ సభ్యులసొమ్మును కు టుంభ సభ్యలకు అందేలా చర్య లు తీసుకుంటారా అసలు ఈ చెల్లింపులు ఎప్పుడు ప్రారంభిస్తారు. ఏ రూపంలో చెల్లిస్తారో అనే అశతో మహిళల్లో చర్చ జరుగుతుంది.