20-12-2025 01:56:56 AM
గురునానక్ యూనివర్సిటీలో నిర్వహణ
హైదరాబాద్, డిసెంబర్ 19(విజయక్రాం తి): గురునానక్ యూనివర్సిటీ ఆఫ్ మే నేజ్‌మెంట్ అండ్ కామర్స్ (యూఐఎంసీ) ఆధ్వ ర్యంలో జాతీయ స్థాయి బిజినెస్ కాన్‌క్లేవ్ (బిజ్‌కాన్) 2025ను ఘనంగా నిర్వహిం చారు. ఈ కార్యక్రమం పరిశ్రమ,విద్యా రంగాల మ ధ్య అనుసంధానాన్ని బలోపేతం చేయడం తో పాటు, విద్యార్థుల్లో నాయకత్వ లక్షణా లు, వ్యాపార దృష్టిని పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహించారు.
గురు నానక్ ఇనిస్టిట్యూషన్స్ ఛాన్స్‌లర్, వైస్ చైర్మన్ సర్దార్ గగన్దీప్ సింగ్ కోహీ,వైస్ ఛాన్సలర్, ఎండీ డాక్టర్ హెచ్ ఎస్ సైనీమార్గదర్శకత్వంలో నిర్వహించారు. కార్యక్రమ ప్రారంభోత్సవానికి రెక్టర్ డాక్టర్ సి. కలైరాస న్, రిజిస్ట్రార్ డాక్టర్ విశాల్ వాలి యా, అడ్వైజర్ డాక్టర్ ఎంపీ సింగ్ ఇషార్, డైరెక్టర్ ప్లా నింగ్ అండ్ డీన్, స్టూడెంట్ వెల్ఫేర్ డాక్టర్ పి పార్థసారథి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
విద్యా రంగానికి చెందిన ప్రముఖు లు, పరిశ్రమ నిపుణులు, పరిశోధకులు, వ్యా పారవేత్తలు, దేశవ్యాప్తంగా వివిధ సంస్థల నుండి వచ్చిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నవీన వ్యాపార ధోరణులు, డిజిటల్ మార్పులు, నాయకత్వం వంటి అంశాలపై చర్చలు జరిగాయి.కీ నోట్ ఉపన్యాసాలు, ప్యానెల్ చర్చలు, పరిశోధన పత్రా ల ప్రదర్శనలు, ఇంటరాక్టివ్ సెషన్లు నిర్వహించారు. కార్యక్రమాన్ని సమర్థవంతంగా సమన్వయం చేసిన డాక్టర రోజ్ మేరీ, విభాగాధిపతి పాత్ర ప్రశంసనీయమని నిర్వాహకులు తెలిపారు.