20-12-2025 01:58:30 AM
ఐబీఎస్ లక్షణాలపై నిపుణుల సూచనలు
హైదరాబాద్, డిసెంబర్ 19(విజయక్రాంతి):ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీ ఎస్) అనేది పెద్ద పేగును ప్రభావితం చేసే దీర్ఘకాలిక జీర్ణాశయ సమస్యగా వైద్య నిపుణులు చెబుతున్నారు.ఇది పేగులకు శాశ్వత నష్టం కలిగించకపోయినా, తరచూ కడుపునొప్పి, మల విసర్జనలో మార్పులు వంటి సమస్యల వల్ల వ్యక్తుల రోజువారీ జీవన నాణ్యతపై గణనీయమైన ప్రభావం చూపుతుందని చందానగర్ మెడికవర్ హాస్పిటల్ కు చెందిన కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, హెపటాలజిస్ట్ డాక్టర్ సబ్బు సూర్య ప్రకాష్ తెలిపారు.
ఐబీఎస్ రావడానికి ఖచ్చితమైన కారణం ఇంకా పూర్తిగా నిర్ధారించబడలేదన్నారు. అయితే పేగుల కదలికలు అసమతు ల్యంగా ఉండడం, పేగుల నరాలు ఎక్కువ సున్నితంగా మారడం, మానసిక ఒత్తిడి, ఆం దోళన, భావోద్వేగ సమస్యలు ప్రధాన కారణాలుగా ఉంటాయని వివరించారు.కాఫీన్ అధికంగా తీసుకోవడం, కారమైన ఆహారం, పాల పదార్థాలు, కృత్రిమ స్వీట్నర్లు వంటి కొన్ని ఆహారాలు ఐబీఎస్ లక్షణాలను మరిం త పెంచుతాయని పేర్కొన్నారు.
కొంతమందిలో తీవ్రమైన కడుపు ఇన్ఫెక్షన్లు లేదా పేగు ల్లోని మంచి బ్యాక్టీరియా సమతుల్యతలో మార్పులు కూడా ఈ సమస్యకు దారితీస్తాయని తెలిపారు. ఐబీఎస్ లక్షణాలు వ్యక్తి వ్యక్తి కి భిన్నంగా ఉంటాయని డా.సూర్య ప్రకాష్ చెప్పారు. సాధారణంగా కడుపునొప్పి లేదా మంట, ఉబ్బరం, అధిక గ్యాస్, విరేచనాలు, మలబద్ధకం లేదా ఇవి రెండూ మారిమారి రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయని అన్నారు.
మానసిక ఒత్తిడి ఉన్న సమయంలో లేదా సమస్య కలిగించే ఆహా రం తీసుకున్నప్పుడు ఈ లక్షణాలు మరింత ఎక్కువవుతాయని వివరించారు.మహిళల్లో ఐబీఎస్ ఎక్కువగా కనిపిస్తుందని, ముఖ్యం గా యువత, ఆందోళన లేదా డిప్రెషన్ ఉన్నవారు, కుటుంబంలో జీర్ణాశయ సమస్యల చరిత్ర ఉన్నవారు అధిక ప్రమాదంలో ఉం టారని తెలిపారు. ఐబీఎస్ చికిత్స లక్షణాలను నియంత్రించి జీవన నాణ్యతను మెరు గుపరచడమే లక్ష్యమని డాక్టర్ సబ్బు సూర్య ప్రకాష్ స్పష్టం చేశారు. ఆహారంలో మార్పు లు అత్యంత కీలకమని, మలబద్ధకం ఎక్కువగా ఉన్నవారికి ఫైబర్ ఆహారం ఉపయోగ కరమని చెప్పారు.
గ్యాస్, ఉబ్బరం కలిగించే అధిక ఫోడ్‌మ్యాప్ ఆహారాలను తగ్గించడం, ప్రోబయోటిక్స్ వాడకం ద్వారా పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చని తెలిపారు. నియమిత వ్యాయామం, తగినంత నీరు తాగడం, సమయానికి భోజనం చేయడం, సరైన నిద్ర వంటి ఆరోగ్యకర జీవనశైలి అలవాట్లతో ఐబీఎస్ లక్షణాలను గణనీయంగా తగ్గించవచ్చని ఆయన సూచించారు.సరైన సమయంలో వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకుంటే ఐబీఎస్‌ఉన్న చాలామంది సాధారణ, నియంత్రిత జీవితం గడపగలరని డా. సబ్బు సూర్య ప్రకాష్ తెలిపారు.