25 August, 2026 | 1:43 AM

ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు

25-08-2026 12:39 AM

భైంసా ఆగస్టు 24 (విజయక్రాంతి): ముధోల్ నియోజకవర్గం లోని ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. కుంటాల మండల కేంద్రంలోని రైతు వేదికలో 73 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను సోమవారం ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముధోల్ నియోజకవర్గం ఇప్పటికే 5000 ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు.

రెండో విడతలో మరో 2,500 ఇళ్లు మంజూరు కానున్నాయని తెలిపారు. ప్రతి పేద కుటుంబం సొంత ఇల్లు నిర్మించుకునేలా తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, బీజేపీ నాయకులు, పాల్గొన్నారు.