26-12-2025 12:48:01 AM
రూ.25లక్షల విలువ చేసే 210 గ్రాముల బంగారు నగలు స్వాధీనం
సికింద్రాబాద్/కంటోన్మెంట్, డిసెంబర్ 25 (విజయ్‌క్రాంతి) : రైళ్లలో ప్రయాణిస్తూ అదును చూసి ప్రయాణీకుల బ్యాగుల తెరిచి విలువైన బంగారు నగలు, నగదు తస్కరిస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను రైల్వే పోలీసు అరెస్టు చేరారు. వారి వద్ద నుంచి రూ.25లక్షల విలువైన 210 గ్రాముల బం గారు నగలు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్లో రైల్వే అర్బన్ డీఎస్సీ జావేద్ , స్థానిక జీఆర్పీ ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్ గౌడ్ కలిసి మీడి యాకు వివరాలు వెల్లడించారు. బెంగళూరు కు చెందిన కోకిల మణిరాజు(39)పాత నేరస్తురాలు.నగరంలోని పలు ప్రాంతాల్ల చోరీలకు పాల్పడగా ఆమెపై సిటీలోని వివిధ పోలీసు స్టేషన్లలో నాలుగు కేసులు నమోదు అయ్యాయి.
ఇదిలా ఉం డగా, తమిళనాడు వెల్లూర్ జిల్లా జోలార్పేట్ ప్రాంతానికి చెంది న ఎస్. దినా(27) ఉపాధి కోసం నగరానికి వచ్చి మధ్యం, సిగరేట్ తాగుడుకు బానిసగా మారాడు.కాగా ఇద్దరు నెలక్రితం పరిచం కాగా దిన తన ఆర్థిక పరిస్థితిని ఆమెకు చెప్పాడు. దీంతో రైళ్లలో చోరీలు చేయాలని ప్లాన్ వేసుకున్నారు.తమ ప్లాన్లోభాగంగా ఇద్దరు వైజాగ్ కెళ్ళి అక్కడ నాందేడ్ ఎక్స్ప్రెస్ ఏసీ కోచ్లో విశాఖ పట్నం నుంచి చర్లపల్లికి రెండు టికెట్లు బుక్ చేసుకున్నారు. రైలు ఎక్కిన వీరిద్దరు అదే కోచ్లో ఉన్న ఇద్దరు మహిళా ప్రయాణీకులు నిద్రలో ఉండగా వారి బ్యాగుల్లోని నగలు దొంగిలించారు.
అక్కడ నుంచి మరో కోచ్కు వెళ్లి చర్లపల్లి రైల్వే స్టేషన్ రాగానే రైలు దిగిపోయారు. కాగా నగలు పోగొట్టకున్న మహిళా ప్రయాణీకులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యా ప్తు మొదలు పెట్టారు. ఇదే క్ర మంలో గురువారం వీరిద్దరు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ గేటు నంబరు 2 వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు వారిని అదుపు లోకి తీసుకుని విచా రించగా నేరాన్ని అంగీకరించారు. వారి వద్ద నుంచి సుమారు రూ. 25 లక్షల విలువ చేసే 210గ్రాముల బంగారు నగలు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.