26-12-2025 02:33:44 AM
ముకరంపుర, డిసెంబరు 25 (విజయ క్రాంతి): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, కరీంనగర్ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అలుగునూరులోని కరీంనగర్ డిస్ట్రిక్ క్రికెట్ అసో సియేషన్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ అంతర్ జిల్లా టి20 లీగ్- 2025 పోటీలు గురువారం ముగిసాయి. ముఖ్య అతిథిగా మాజీ మేయర్, బిజెపి నాయకుడు యాదగిరి సునీల్ రావు హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కరీంనగర్ జిల్లా నుండి మరింత మంది అమన్ రావులు రావాలని అన్నారు.
కరీంనగర్ నగరంలో ఇంత మంచి క్రికెట్ గ్రౌండ్ ను అందించినందుకు నగర, జిల్లా ప్రజలందరికీ పక్షాన ఆగమ రావు, వారి టీమ్ అందరికీ ధన్యవాదాలు తెలిపారు. క్రికెట్ అనేది డెడికేషన్ తో కూడుకున్న ఆట అని, అవకాశం బట్టి ఆడుకునే ఆట కాదని అన్నారు. క్రికెట్ ఆడడం వల్ల చాలా ఉన్నాయని, అవకాశాలు అందుపుచ్చుకోవడం మీ చేతుల్లోనే ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ క్రికెట్ అసోసియేషన్ బాధ్యులు మహేందర్ గౌడ్, మురళీధర్ రావు, అజిత్ రావు, విద్యాసాగర్, తదితరులు పాల్గొన్నారు.