calender_icon.png 26 December, 2025 | 2:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నడిగడ్డలో ప్రజాబంగ్లా ప్రారంభం

26-12-2025 12:49:29 AM

డీసీసీ అధ్యక్షుడు మలిచేటి రాజీవ్ రెడ్డి

గద్వాల్ డిసెంబర్ 25: నడిగడ్డ ప్రజలు ఎవరు అధైర్యపడొద్దని మీకు అండగా ప్రజాబంగ్లా ఉంటుందని డీసీసీ అధ్యక్షుడు మలిచేటి రాజీవ్ రెడ్డి అన్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా డీసీసీ అధ్యక్షులుగా మలిచేటి రాజీవ్ రెడ్డి నియమాకం సందర్భంగా గురువారం గద్వాల పట్టణంలో రాజీవ్ మార్గ్ లో నూతనంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్ర మానికి టీపీసీసీ ఉపాధ్యక్షులు, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, టీపీసీసీ ఉపాధ్యక్షులు కొండేటి మల్లయ్య, పార్లమెంట్ నియోజక ఇంచార్జ్ జనరల్ సెక్రెటరీ సంధ్యా రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి, మహబూబ్ నగర్ డీసిసి అధ్యక్షులు సంజీవులు ముదిరాజ్ హాజర య్యారు. ఈ సందర్భంగా గద్వాల జిల్లా డీసీసీ అధ్యక్షులుగా మలిచేటి రాజీవ్ రాజీవ్ రెడ్డి బాధ్యతులు స్వీకరించారు.

నూతన డీసిసి అధ్యక్షులను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులతో పాటు జిల్లా నాయకులు శాలువాతో  సన్మానించి అభినందించారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి తమపై నమ్మకంతో డిసిసి అధ్యక్షులు తమపై నమ్మకంతో ఈ అవకాశం కల్పించారని వారి నమ్మకాన్ని వమ్ము చేయ కుండా కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తానని డీసీసీ అధ్యక్షుడు మలిచేటి రాజీవ్ రెడ్డి వెల్లడించారు.    నడిగడ్డ ప్రజల కోసమే కొత్త బంగ్లా ప్రారంభించామని తన కార్యాలయాన్ని  ‘ప్రజా బంగ్లా‘ గా నామకరణం చేస్తున్నామని ప్రకటించారు. 

డీసీసీ అధ్యక్షులు స్వీకరించిన రాజీవ్ రెడ్డిని రాష్ట్ర నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. అంతకుముందు కాంగ్రెస్ శ్రేణులు నగరంలో బైక్ ర్యాలీ చేపట్టారు.  నూతన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు  చిన్నారెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతురావులు డీసీసీ అధ్యక్షులు రాజీవ్ రెడ్డి శాలువాతో సన్మానించారు. అనంతరం నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మున్నూరు కాపు సంఘం నాయకులు శాలువాతో సన్మానించి అభినందించారు.