26-12-2025 02:32:14 AM
కొత్తపల్లి, డిసెంబర్ 25(విజయక్రాంతి):కొత్తపల్లి మండలం ఎలగందుల నూతనంగా ఎన్నికైన గ్రామ పంచాయతీ పాలకవర్గం గురువారం రోజున సర్పంచ్ నిమ్మల అంజయ్య ఆధ్వర్యంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను మినిస్టర్ క్వాటర్స్ లో కలవడం జరిగింది. ఈ సందర్బంగా ఎలగందుల గ్రామ అభివృద్ధికి పర్యటకంగా తీర్చిదిద్దలని కోరారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ సర్పంచ్ నిమ్మల అంజయ్య కు ప్రత్యేక అభినందించి, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసి, ఎలగందుల గ్రామ, చ్‌గామ అభివృద్ధికి సహకరిస్తానని, గ్రామ అభివృద్ధి కోసం అందరూ ఐక్యంగా కలిసి పనిచేయాలని తెలిపి, కరీంనగర్ జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేసి ఎలగందుల గ్రామ అభివృద్ధి కి తగు చర్యలు తీసుకోవాలని తెలియజేసారు.కొత్తపల్లి మం డల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పంజాల స్వామి,ఉప సర్పంచ్ గసికంటి కుమార్, వార్డు సభ్యు లు,గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు మరియు పార్టీ నాయకులు కలిశారు.