26-12-2025 12:47:35 AM
అలంపూర్, డిసెంబర్ 25: ఇటిక్యాల మండల పరిధిలోని బుడ్డారెడ్డి పల్లె గ్రామ సర్పంచ్ కుర్వ సుజాత రాఘవేంద్ర ఆధ్వర్యంలో ముళ్ళ పొదలను తొలగించే కార్యక్రమం నిర్వహించారు. బుడ్డారెడ్డి పల్లె నుంచి రామాపురం మీదుగా శాంతి నగర కు వెళ్లే రోడ్డు మార్గం వరకు, రోడ్డుకు ఇరు వైపులా ఉన్న ముళ్ళ పొదలను జెసిబి సహాయంతో సొంత ఖర్చులతో పనులను చేపట్టారు.గ్రామంలోని ప్రతి సమస్యను పరిష్కారము చేసి, గ్రామ అభివృద్దే లక్ష్యంగా పని చేస్తా అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు