26-12-2025 12:00:00 AM
లక్షలు ఖర్చు చేసినా దక్కని శాశ్వత పరిష్కారం
దుర్వాసనలతో వాహనదారులు ఉక్కిరి బిక్కిరి
నిరుపయోగంగా మారిన డంపింగ్ యార్డ్
పట్టించుకోని మున్సిపల్ అధికారులు
సమస్యకు పరిష్కారమెన్నడో..?
మణుగూరు, డిసెంబర్25,(విజయక్రాంతి): పట్టణ శివారు ప్రాంతాలు డంపింగ్ యార్డులుగా మారిపోతున్నాయి. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో ఇతర ప్రాంతాల నుం చి మణుగూరు పట్టణానికి వచ్చే ప్రజలకు వ్యర్థాలు స్వాగతం పలుకుతున్నాయి. సిబ్బం ది పట్టణంలో చెత్తను డంపింగ్ యార్డుకు తరలించకుండా పట్టణ శివారు ప్రాంతాల్లోని రోడ్ల పక్కనే చెత్తను అన్ లోడ్ చేస్తున్నా రు. దీనికి తోడు ప్రైవేటు వ్యక్తులు సైతం ఇంటి నిర్మాణ వ్యర్థాలను, కొబ్బరి బోండా ల, చికెన్ సెంటర్ల వ్యాపారులు కోళ్ళ వ్యర్థాలను రోడ్ల పక్కనే వాహనాల్లో తెచ్చి వేస్తు న్నారు.
దింతో ప్రధాన రహదారి దుర్గంధం వెదజల్లుతున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. మరోవైపు వ్యర్ధాలతో వాహనాల రాకపోకలకు ఇబ్బందికరంగా మారుతున్నా యి. లక్షల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన డంపింగ్ యార్డు నిరుపయోగంగా మారడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్టగా కనిపిస్తున్నాయి. ప్రజారోగ్యం తీవ్ర ప్రభావం చూపుతుంది దీనిపై విజయక్రాంతి కథనం..
శివారు ప్రాంతాలలో కంపు కంపు...
పట్టణంలో సేకరించిన చెత్తనంతా సీఎస్పీ కాటా ప్రాంతంలోని మెయిన్ రోడ్డు పక్కనే పడేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా తీవ్ర దుర్వాసనతో కంపు కొడుతోంది. ఈ మార్గం లో ప్రయాణించే వాహనదారులు, స్థానికులు దుర్గంధాన్ని భరించలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ అపరిశుభ్రత వల్ల రోగాల బారిన పడతామేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
పౌరుల నుంచి పన్నులు వసూలు చేస్తూ.. ప్రజారోగ్యాన్ని పట్టించుకో ని మున్సిపల్ అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. కాగా లక్షలు ఖర్చు పెట్టి కొనుగోలు చేసిన చెత్త తరలింపు వాహనాలు కూడా మరమ్మతులకు గురై కార్యాల యం లోనే తుప్పు పడుతున్నాయి. నిర్వహణ లోపంతో కునారిల్లుతున్నన్నాయి.
దూరాభారంలో డంపింగ్ యార్డ్..
పట్టణంలో డంపింగ్ యార్డ్ నిర్వహణ లోపంతో ప్రజారోగ్యం తీవ్ర ప్రమాదంలో పడింది. లక్షల రూపాయలు ఖర్చు చేసిన నిర్మించిన డంపింగ్ యార్డు నిరుపయోగం గా మారడం అధికారుల నిర్లక్ష్యానికి పరా కాష్టగా కనిపిస్తుంది. పట్టణం నుంచి సుమా రు 12 కిలో మీటర్ల దూరంలో అన్నారం గ్రామ సమీపంలో ఈ డంపింగ్ యార్డును నిర్మించడంతో అక్కడికి చెత్త తరలించే వాహనాలు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది.
వాహనాలకు ఒక్క ట్రిప్కే రూ. 500 వరకు డీజిల్ ఖర్చు అవుతోందని,ఈ డంప్ యార్డు విని యోగించకపోవడంతో పట్టణంలో సేకరించిన చెత్తను ప్రధాన రహదారి పక్కనే డంపు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఫలితంగా ఈప్రాంతమంతా దుర్వాసన వెదజ ల్లుతున్నది. స్థానికు లు, రోడ్డు వెంబడి వెళ్లే వాహనదారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రోగాల బారిన పడే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు.
నిర్వహణ లోపంతో, ప్రజలకు ఇక్కట్లు
చెత్త నిర్వహణపై ప్రజలలో అవగాహన కొరవడంతోపాటు అధికారుల నిర్లక్ష్యంతో రోడ్ల పైన చెత్త దర్శనమిస్తున్నది. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గాలి దుమారం తో చెత్తాచెదారం రోడ్లపైకి వచ్చి చేరుతు న్నడం తో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై పారేసిన చెత్తతో దుర్గంధం వెదజల్లుతుండటంతో ముక్కు మూసుకొని వెళ్లవలసిన పరిస్థితి
నెలకొంటుందని ప్రజలు వాపోతున్నారు.అధికారులు సరైన రీతిలో పర్యవేక్షణ లేకపోవడంతో పాటు ప్రజలకు విస్తృతస్థాయిలో అవగాహన కల్పించడంలో విఫలమ య్యారనే విమర్శలున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి, ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు వ్యర్థాలను పట్టణ శివారు రోడ్లపై వేయకుండా చర్యలు తీసుకోవాని పలువురు కోరుతున్నారు.