26-12-2025 02:34:54 AM
వెల్గటూర్, డిసెంబర్ 25(విజయక్రాంతి):క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని వెల్గటూర్ ఉమ్మడి మండలం రాజారాంపల్లి గ్రామంలోని చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని, క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
ఆయన మాట్లాడుతూ ప్రేమ, దయ, శాంతి, సౌభ్రాతృత్వాన్ని బోధించిన యేసుక్రీస్తు సందేశం నేటి సమాజానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు.అన్ని మతాలు, వర్గాల ప్రజలు ఐక్యతతో కలిసి జీవించాలనే భావనతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు.
పేదల సంక్షేమం, సామాజిక న్యాయం లక్ష్యంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి అన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ సంఘ రమేష్ యాదవ్, చర్చ్ ఫాదర్ యోహాను, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.