27-09-2025 07:45:59 PM
తాండూరు,(విజయక్రాంతి): గత రెండు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలో వరద ప్రవాహ ప్రాంతాలను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణరెడ్డి లతో కలిసి కొకట్ నది బ్రిడ్జి, వీర్ శెట్టిపల్లి, గోనూరు ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ఈ సందర్భంగా వారు ప్రజలతో మాట్లాడుతూ... అత్యవసరం ఉంటేనే ఇంటి నుండి బయటికి రావాలని జాగ్రత్తలు తీసుకోవాలని సమస్యలు ఏమైనా ఉంటే సంబంధిత రెవెన్యూ, స్థానిక పోలీసులకు సంప్రదించాలని కోరారు.