17-06-2025 12:58:32 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 16 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్‌లో నిబం ధనలకు విరుద్ధంగా భవనాల నిర్మాణాలను అరికట్టడానికి, వాటి వినియోగాన్ని పూర్తిగా నిలువరించడానికి గాను ఇప్పటికే ఉన్న నిబంధనల్లో జీహెచ్‌ఎంసీ మరిన్ని కఠినమైన మార్పులు చేసింది. ఈ మేరకు జీహె చ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ సోమవారం ప్రత్యేక ప్రొటోకాల్, నూతన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను విడుదల చేశారు.
భవనాల సీజ్ ఉన్నతాధికారులదే..
నూతనంగా జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఒక భవనాన్ని సీజ్ చేసిన అధికారికంటే పైస్థాయి అధికారి మాత్రమే ఆ భవ నంపై వేసిన ముద్రలను తొలగించే అధికారం కలిగి ఉంటారు. ఉదాహరణకు డిప్యూ టీ కమిషనర్ డీసీ ఒక భవనాన్ని సీజ్ చేస్తే, ఆ సీల్‌ను తొలగించే అధికారం జోనల్ కమిషనర్‌కు (జెడ్సీ) మాత్రమే ఉంటుంది. జోన ల్ కమిషనర్ సీజ్ చేస్తే, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు మాత్రమే తొలగించే అధికారం ఉంటుంది.
టీజీ-బిపాస్ చట్టం, 2020 ప్రకారం, రెండు సందర్భాల్లో భవనాలను సీజ్ చేయవచ్చని ఈ మార్గదర్శకాలు స్పష్టం చేశాయి. భవన అనుమతి కోసం తప్పుడు లేదా తప్పుదోవ పట్టించే సమాచారం సమర్పించిన ప్పుడు. ముందుగా అనుమతి తీసుకోకుండా లేదా ఆమోదించిన ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మాణం చేపట్టినప్పుడు. సుప్రీంకోర్టు డిసెంబర్ 2024లో జారీ చేసిన మార్గ దర్శకాలు, తెలంగాణ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను కూడా ఈ సీజ్ ప్రక్రియలో కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.
సీజ్ ప్రక్రియ ఇలా ఉంటుంది
ఒకసారి నోటీసు జారీ చేసిన తర్వాత, సంబంధిత జిల్లా కలెక్టర్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ చీఫ్ జోనల్ కమిషనర్ లేదా నియమించిన నోడల్ అధికారికి సమాచారాన్ని పంపించి, నిర్మాణంపై స్పష్టంగా నోటీసును అంటించాలి. ఒకవేళ నిర్మాణం తక్షణమే ఆపకపోతే, నోటీసు ఇచ్చిన మూడు రోజుల్లో సీజ్ ప్రక్రియ మొదలవుతుంది. ఎరుపు రం గు రిబ్బన్‌ను మొత్తం నిర్మాణం చుట్టూ బిగించాల్సి ఉంటుంది.
అధికారుల సంతకాలతో కూడిన ట్యాగ్ జతచేయాలి. ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలపై, మెట్లు, లిఫ్ట్లు, ర్యాంపు లు మొదలైన వాటిని ప్లైవుడ్ లేదా గట్టి బో ర్డులతో మూసేయాలి. తాళాలు వాడే అవకాశం ఉంటే, వాటిని దుస్తులతో కప్పి, మో ముతో ముద్ర వేయాలి. సీజ్ ప్రక్రియ మొ త్తం ఫొటోగ్రఫీ, వీడియో రికార్డింగ్ ద్వారా తప్పనిసరిగా డాక్యుమెంట్ చేయాలి. విద్యు త్, నీటి కనెక్షన్లను తొలగించేందుకు సంబంధిత శాఖలకు సమాచారం ఇవ్వాల్సి ఉం టుంది.
పోలీసు స్టేషన్ అధికారికి, ఆస్తి వివాదాలు తలెత్తకుండా సంబంధిత సబ్-రిజిస్ట్రా ర్‌కు కూడా సీజ్ సమాచారం తెలియజేయా లి. ఆస్తిపై ఏమైనా లీగల్ కేసులు ఉంటే, ము న్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్‌కు సమాచారం అందించాలి. సీజ్ చేసిన ప్రక్రియలో పాల్గొ న్న పోలీసు, పౌర సిబ్బంది వివరాలతో కూడిన సమగ్ర నివేదికను తయారుచేసి, ఇద్దరు పంచుల సంతకాలతో సహా కమిషనర్‌కు పంపించాలి. ఈ నివేదికను డిజిటల్ పోర్టల్‌లో కూడా ప్రదర్శించాలి.