26-12-2025 12:00:00 AM
వెంకటపురం(నూగూరు)డిసెంబర్25(విజయక్రాంతి):ములుగు జిల్లా వెంకటాపురంలో ఎమ్మార్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం యాసం రమేష్ మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సమావేశానికి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు వావిలాల స్వామి మాదిగ పాల్గొని మాట్లాడుతూ వెంకటాపురం మండలం బోధపురం గ్రామ శివారులో సర్వేనెంబర్ 7/15 మరియు 56/ 4 జెడ్ లో సెటిల్మెంట్ పట్టాలో గుద్దేటి ఎల్లయ్య మాదిగ మరియు వారి వారసత్వము 1960కి ముందు నుండి తెలంగాణల నిజాం ప్రభుత్వము మాదిగలకు ఇనాం ఇచ్చినటువంటి భూమి ఆ భూమిలో గత 70 సంవత్సరాల నుండి నివాసము ఉంటున్న గుద్దేటి లాలమ్మ w/oపెంటయ్య కుమారుడు ఎల్లయ్య ఆ భూమిపై ఆధారపడి జీవిస్తున్నారు.
ఈ నెల 21 తేదీన మా మామ గుద్దేటి ఎల్లయ్య సంపాదించిన భూమి అని భూమి పైకి వెళ్లి చెత్తాచెదారం శుభ్రం చేస్తుండగా అదే గ్రామానికి చెందిన ఈ భూమి మాదని నకిలీ పత్రాలతో వచ్చిన గుడిశాల సత్తయ్య సన్నాఫ్ నరసయ్య గుడిశాల అనసూర్య భర్త సత్తయ్య గుడిశాల అనసూర్య భర్తసత్తయ్య గొడిశాల కమల కుమారి తండ్రి సత్తయ్య గుడిశాల రాజేష్ తండ్రి రమణయ్యలు ఆ భూమి వద్దకు చేరుకొని గుద్దేటి లాలమ్మను కులం పేరుతో దూషించి విచక్షణ రైతంగా తాను 70ఏళ్ల పైబడిన అని చూడకుండా తీవ్రంగా దెబ్బలు కొట్టి దెబ్బలు బయట కనపడకుండా పిడుగులతో వీపు పైన కడుపుల తన్ని గాయపరిచినారు .
గాయపరిచిన వారిని ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధిక చట్టం క్రింద కేసు నమోదు చేసి వెంటనే రిమాండ్ కు తరలించి జైలుకు పంపాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి డిమాండ్ చేస్తున్నది ఇకముందు మా మాదిగ దళిత బిడ్డల పైన దాడులు జరగకుండా కాపాడాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై ఉందని ముఖ్యంగా పోలీసు వారిపై ఉందని తెలియజేస్తా ఉన్నాము.