26-12-2025 12:01:10 AM
మరిపెడ,డిసెంబర్ 25(విజయ క్రాంతి)మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల ఉగ్గంపల్లి గ్రామంలో క్రిస్మస్ వేడుకలను గురువారం క్రిస్టియన్లు ఘనంగా జరుపుకున్నారు. మండలం లోని ఉగ్గంపల్లి గ్రామంలో గురువారం గుడ్ ఫ్రూట్ మినిస్ట్రీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్య నాయక్ మాట్లాడుతూ యేసు క్రీస్తు పుట్టిన రోజును ప్రపంచ ప్రజలు జరుపుకునే ప్రత్యేకమైన పండుగని, యేసు క్రీస్తు పుట్టిన రోజు ప్రజలందరికీ సంతోషం కలగజేసే ప్రపంచ పండగ అని అన్నారు.
యేసు క్రీస్తు బోధనలు మానవాళికి అనుసరణీయమని ఆయన అన్నారు . ఆయన బోధలు ఆయన చూపిన మార్గం మానవాళి నీ మనుషులుగా, మానవతా విలువలు కలిగి మనుషులంతా బ్రతకాలని తెలియజేసే మార్గమని తెలిపారు. మానవ విలువలు నేర్పిన ఆయన బోధనలు అనుసరిస్తే మనిషిని మనిషిగా ప్రేమించే గుణం అలవాటు ఉందన్నారు. మానవతా విలువలు నేర్పిన, మనుషులను ప్రేమించిన మానవతా విలువలు కలిగిన మహనీయుడని ఆయనను కీర్తనలు పాడి కొనియాడారు. రక్షించే ప్రభువు అని ఆరాధించారు.
అందుకే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని బోధ చేశారు అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి గ్రామ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉగ్గంపల్లి గ్రామ సర్పంచ్ ఎండి ఆయుబ్ పాషా, మాజీ ఎంపీటీసీ భర్తపురం ఉదయమ్మ, మండల నాయకులు ముత్యం వెంకన్న, బొల్లం శివయ్య ముత్యం, అంబరీష, దోమల నవీన్, వార్డు మెంబర్ ముత్యం, రంజిత్, జోసెఫ్, ఇలియాజ్ ,శ్యామ్, తదితరులు పాల్గొన్నారు.