calender_icon.png 26 December, 2025 | 3:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అడ్డుగా ఉన్నాడని భర్తను అంతమొందించింది

26-12-2025 01:41:53 AM

  1. ప్రియుడితో కలిసి భార్య ఘాతుకం
  2. నిందితులిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే
  3. నవంబర్ 25న అచ్చంపేటలో ఘటన

అచ్చంపేట, డిసెంబర్ 25(విజయక్రాంతి): ఓ మహిళ పరాయి వ్యక్తి మోజులో పడి భర్తనుప్రియుడితో కలిసి అంతమొం దించింది. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు. కేసు వివరాలను అచ్చంపేట సీఐ నాగరాజు వెల్లడించారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని మారుతీనగర్ కాలనీలో నవంబరు 25న లక్ష్మణ్‌నాయక్ (38) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఘటనపై మృతుడి సోదరుడు శ్రీరామ్ అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేపట్టారు. లక్ష్మణ్‌నాయక్ భార్య పద్మ (30) ప్రభుత్వ ఉపాధ్యాయురాలు.

ఉప్పునుంతల మండలం గట్టుకాడిపల్లి తండా ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తోంది. ఇదే మండలంలోని తాడురు ప్రాథమికోన్నత పాఠశాలలో రాత్లావత్ గోపి (36) ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఆమెతో ఏడాదిగా వివాహేతర సం బంధం నడుస్తోంది. లక్ష్మణ్‌నాయక్ గతంలో రంగారెడ్డి జిల్లాలోని గురుకులంలో కాంట్రాక్టు ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు. భార్యకు ఉ ప్పునుంతల మండలంలో పోస్టింగ్ రావడంతో అచ్చంపేటకు వచ్చారు. లక్ష్మణ్ ఖాళీగా ఉంటున్నాడు. తమ బంధానికి భర్త లక్ష్మణ్‌నాయక్ అడ్డుగా ఉన్నాడని భావించి భార్య పద్మ, గోపి అతడిని అంతమొందించాలనుకున్నారు.

నవంబరు 24న రాత్రి నిద్రిస్తున్న లక్ష్మణ్‌నాయక్ ముక్కు, నోటిపై వస్త్రంతో అదిమిపట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. మరుసటి రోజు ఉదయం ఏమీ తెలియనట్లుగా పద్మ పాఠశాలకు వెళ్లి ఇంటి యజమానికి ఫోన్ చేసింది. తన భర్తకు ఫోన్‌చేసినా స్పందించడంలేదని ఆందోళన నటించింది. మధ్యాహ్నం ఇంటికొచ్చి లోపల భర్త చనిపోయి ఉన్నాడని అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ పోలీసులు దర్యాప్తు లో  వాస్తవాలను రాబట్టారు. హత్య చేసిన అనంతరం పద్మ సమీప బంధువు నర్సింహకు ఫోన్ చేసి విషయం చెప్పినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. పద్మ, గోపిలను బుధవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా.. వారికి  రిమాండ్ విధించినట్లు సీఐ తెలిపారు.