26-12-2025 01:46:37 AM
హమాస్ చీఫ్ హనియే హత్యకు కొన్ని గంటల ముందు జరిగిన భేటీని గుర్తు చేసుకున్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ
న్యూఢిల్లీ, డిసెంబర్ 25: రాబోయే కాలం భవిష్యత్ కాలం. అంతా హై-టెక్నాలజీదే కీలక రోల్. అందుకే సాంకేతికత, భవిష్యత్‌పై దృ ష్టి పెట్టాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అ న్నారు. హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియే టెహ్రాన్‌లో హత్యకు గురికావడానికి కొన్ని గంటల ముందు ఆయనను ఎలా కలిశారో కూడా గడ్కరీ వివరించారు. దాదాపు ఏడాదిన్నర క్రితం హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియాను ఇజ్రాయెల్ అంతం చేసి న ఘటనకు సంబంధించి కీలక విషయాలను గడ్కరీ తాజాగా తెలిపారు. ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో గడ్కరీ మాట్లాడుతూ, 2024 నాటి ఇరాన్ పర్యటన గురించి వివరించారు.
ఇరాన్ కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో భారతదేశానికి ప్రాతినిథ్యం వహించడానికి ప్రధాని మోదీ అభ్యర్థన మేరకు తాను ఇరాన్‌కు వెళ్లానన్నారు. టెహ్రాన్‌లో ఓ ఫైవ్-స్టార్ హోటల్‌లో అన్ని దేశాధినేతలు బస చేశా రు. ఆ ప్రముఖుల్లో ఒక వ్యక్తిని నేను గమనించాను. నేను కూడా కరచాలనం చేసి అడిగాను. అతను హమాస్ అధిపతి’ అని చెప్పారని పేర్కొన్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత ‘నేను కూడా నా హోటల్‌కు వచ్చి రాత్రి భోజనం చేసి నిద్రపోయాను. తెల్లవారుజామున 4 గంటలకు, రాయబారి వచ్చి తలుపు తట్టి, ‘సార్.. మనం ఖాళీ చేయాలి’ అని అన్నారు.
నేను ఎందుకు అన్నాను. హమాస్ అగ్రనేత హత్య జరిగిందని ఆయన చెప్పారని గడ్కరీ పేర్కొన్నారు. ఈ హత్యకు ఉపయోగించిన కచ్చితమైన పద్ధతి అస్పష్టంగానే ఉందని గడ్కరీ చెప్పారు. జాతీయ భద్రత, ఆధునిక యుద్ధం, కీలక మౌలికసదుపాయాల దృక్కోణం నుంచి భవిష్యత్ హై-టె క్నాలజీ ఎంత ముఖ్యమో ఆయన వివరించారు. సాంకేతిక, సైనికసామర్థ్యం ప్రపం చ ప్రభావాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో ఇజ్రాయెల్ ఒక ఉదాహరణ అన్నారు. బలమైన దేశాలను లక్ష్యంగా చేసుకోవడం కష్టం అని గడ్కరీ వ్యాఖ్యానించారు.