calender_icon.png 10 November, 2025 | 7:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మిక వర్గ పోరాటాలను బలోపేతం చేయాలి

10-11-2025 05:45:42 PM

ములకలపల్లి (విజయక్రాంతి): బిజెపి ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్ లను అమలు చేసేందుకు శ్రమ పాలసీ తీసుకొస్తుందని దాన్ని వ్యతిరేకించాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పిట్టల అర్జున్ ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన సిఐటియు మండల మహాసభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల పట్ల నిర్లక్ష్యపు ధోరణి ప్రదర్శిస్తుందని ఆరోపించారు. దేశంలో దోపిడి, అసమానతలు, పెట్టుబడి వర్గాన్ని బిజెపి ప్రభుత్వం పెంచి పోషిస్తుందని ఆరోపించారు. కార్మిక వర్గ లక్ష్యాలకు అనుగుణంగా దోపిడీ లేని సమాజాన్ని స్థాపించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉద్యమ పోరాటాలు నిర్వహించాలన్నారు.

నాలుగు లేబర్ కోడ్లను తిప్పి కొట్టడంలో సిఐటియు అన్ని రంగాల కార్మికులను ఏకం చేసి నల్ల కార్మిక చట్టాలను తిప్పికొట్టడంలో సిఐటియు ముందు ఉందని  తిప్పితెలిపారు. దేశంలో వామపక్ష ప్రభుత్వం కేరళ తప్ప మిగతా కొన్ని రాష్ట్రాలలో 10 గంటల పని విధానాన్ని అమలు చేయడానికి అనేక పాలకవర్గాలు ప్రయత్నించాయని తెలిపారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ లను కేరళ రాష్ట్రంలో అమలు చేయబోమని ప్రభుత్వం లేబర్ కోడ్ లను తిప్పి కొట్టడంలో ముందుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు దుబ్బా ధనలక్ష్మి, సిఐటియు మండల కన్వీనర్ నిమ్మల మధు, దమ్మపేట మండల కన్వీనర్ మురాహరి రఘు, బుగ్గ వెంకట నరసమ్మ, ఓరుగంటి శ్రీను, కేసరి జయ, చిక్కుల శ్రీను, వర్కా రుక్మాదారావు, నల్లి సుజాత, ఎస్కే మస్తాన్, ఉమా, ఇందిరా, వగ్గల ధారయ, కాంతి, తిరుపతమ్మ, సూరం పుల్లారావు, హలవత్ శివ, సైదమ్మ, ఎస్ఎఫ్ఐ మండల నాయకులు ముదిగొండ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.